తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. దేవాలయాలను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడంపై సర్కారుకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం దేవాలయాలను ఆధీనంలోకి తీసుకోవడాన్ని మాజీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సవాలు చేశారు. స్వామి పిటిషన్పై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది… ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బ్రాహ్మణేతరులను అర్చకులుగా నియమించడంపై కూడా స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది.
తమిళనాడులో దీక్షితుల నిర్వహణలో వందలాది ఆలయాలున్నాయి. ఇప్పటి వరకూ దేవాదాయ శాఖ జోక్యం చేసుకోలేదు. దేవాలయాల అధీనాలు, దీక్షితుల ఆధ్వర్యంలో ఉన్న ఆలయ ఆస్తుల లెక్కించాలని స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అధీనాధిపతులు, దీక్షితులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై మాజీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
https://twitter.com/LawBeatInd/status/1564129470184755202?s=20&t=i3xnEsWp9XCJqgfPyXY5TQ