పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం అనుమతి
పూరీ జగన్నాథయాత్రకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. కరోనా సంక్షోభం నేపధ్యంలో పూరీ జగన్నాధ్ యాత్ర కు అనుమతిపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఒడిశాలోని పూరీలో ప్రతియేటా అత్యంత ఘనంగా జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. కరోనా కారణంగా యాత్ర నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. అయితే పూరీలో మాత్రమే నిర్వహించాలని…మిగిలిన ప్రాంతాల్లో వద్దని కోర్టు పేర్కొంది. పూరీ మినహా మిగిలిన ప్రాంతాల్లో రథయాత్రల్ని అనుమతించేది లేదని ఒడిశా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది.
అయితే హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు కూడా జగన్నాథ రథయాత్రను చూసేందుకు పూరీ వెళ్లాలనే ఉంది. కానీ మనం నిపుణులం కాదు. ఈ విషయంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారంలో ఛాన్స్ తీసుకోలేం, కావాలంటే యాత్రను టీవీలో చూడవచ్చు, వచ్చే దఫా భగవంతుడు అనుగ్రహిస్తాడని నమ్ముతున్నామని చీఫ్ జస్టిస్ అన్నారు.