
Supreme Court of India
అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ల అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది. వారికి 10శాతం కోటా విషయంలో కేంద్రం నిర్ణయాన్ని సమర్థించింది ధర్మాసనం. ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ సోమవారం 3:2తో తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనంలోని జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ జే బి పార్థీవాలా సమర్థించగా..సీజేఐ జస్టిస్ లలిత్ మరో న్యాయమూర్తి జస్టిస్ రవీంద్ర భట్ వ్యతిరేకించారు. EWS లకు పదిశాతం కోటా కల్పిస్తూ చేసిన 103 వ రాజ్యాంగ సవరణ చట్టబద్దమైనదేనని, రాజ్యాంగ మూల స్వరూపాలను ఉల్లంఘించడం లేదని జస్టిస్ దినేష్ మహేశ్వరి తీర్పును వెలువరించారు. రిజర్వేషన్లు కొందరి ప్రయోజనాల కోసం కాక సమాజిక, ఆర్థిక అసమానతలను అంతం చేయడానికి అనుమతించినవని జస్టిస్ పార్థీవాలా అన్నారు. అంతేకాక రిజర్వేషన్లలో 50 శాతం పరిమితి అనేది ఎప్పుడూ ఒకేలా ఉండాలని లేదని వ్యాఖ్యానించారు. ఈ రిజర్వేషన్ల కేటాయింపులో ఎక్కడా వివక్ష లేదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడ్డారు. వీరిద్దరి తీర్పులతో జస్టిస్ బేబీ పార్థీవాలా ఏకీభవించారు. అయితే జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం వీరి అభిప్రాయాలతో విభేదించారు. ఈడబ్ల్యూఎస్ లకు 10శాతం కోటా సుప్రీంకోర్ట్ రిజర్వేషన్లపై నిర్ణయించిన 50శాతం పరిమితిని దాటుతుందని, జస్టిస్ భట్ అన్నారు. భట్ వాదనను సీజేఐ జస్టిస్ లలిత్ అంగీకరించారు.
2019 ఎన్నికలకు ముందు కేంద్రం ఈ రిజర్వేషన్లు తీసుకువచ్చింది. ఆ ఏడాది జనవరి 8న కేంద్రం లోక్‌సభలో బిల్లును ప్రవేశపెట్టిగా అనుకూలంగా 323 ఓట్లు,వ్యతిరేకంగా 3 ఓట్లు వచ్చాయి. డీఎంకే, లెఫ్ట్ పార్టీల ఎంపీలు కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓటింగ్‌లో పాల్గొనలేదు. జనవరి 10న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 165 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేయగా.. ఏడుగురు 7 ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేశారు.
https://twitter.com/LiveLawIndia/status/1589489477323755520?s=20&t=lPIq1pSjggugAdD0en46uw
దీంతో 2019 జనవరి 31 న ఈడబ్యూఎస్ రిజర్వేషన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. 103వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15, 16కి క్లాజ్ (6)ని జోడించి ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు ఉద్యోగాలు కల్పించింది. దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు.. ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
103 వ రాజ్యాంగసవరణ ద్వారా ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాలకు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. రిజర్వేషన్లపై 1992లో సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితిని దాటి ఈ కోటాను ఎలా ఇస్తారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ తుది తీర్పు ఇచ్చింది.
https://twitter.com/scobserver/status/1589507757874774022?s=20&t=lPIq1pSjggugAdD0en46uw