జమ్మూ కాశ్మీర్లో విషాదం చోటు చేసుకుంది. హిందువులన లక్ష్యంగా చేసుకుని మతోన్మాదులు రెచ్చిపోయారు. ఐడి కార్డుల ద్వారా హిందువులను గుర్తించి ఏరి కోరి కాల్చి చంపేశారు.
…….
అనంత్‌నాగ్ జిల్లాలో మినీ స్విట్జర్లాండుగా పేరున్న బైసరన్ ప్రాంతం రక్తంతో తడిసిపోయింది. పర్యాటకులపై సైనిక దుస్తుల్లో వచ్చిన ఏడుగురు ముష్కరులు అతి సమీపం నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఇటీవల కాలంలో అతిపెద్ద ఉగ్రదాడి ఇదే.
……
ఉగ్ర మూకలను మట్టుబెట్టేందుకు సైన్యం రంగంలోకి దిగింది. అణువణువూ గాలింపు చేపట్టారు. ఉగ్రమూకల కాల్పుల శబ్దం వినిపించగానే బైసరన్ ప్రాంతానికి సైనిక బలగాలు చేరుకున్నాయి. గాయపడ్డ వారిని హెలికాఫ్టర్లు, గుర్రాల ద్వారా ఆసుపత్రులకు తరలించారు. పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
……
ఈ ఘటన విషయం తెలియగానే జెడ్డా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు . పర్యటన కుదించు కొని తిరిగి వచ్చేశారు. విషయం తెలియగానే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేకు విమానంలో ఘటనా స్థలానికి వెళ్లారు. జమ్ము కశ్మీర్ లెప్ట్నెంట్ గవర్నర్ కూడా ఘటనా స్థలానికి వెళ్లారు.
…….
జులై 3 నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. 36 రోజుల పాటు కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 3 లక్షల మంది ఈ యాత్రలో పాల్గొనే అవకాశముంది. అమర్నాథ్ యాత్ర ప్రారంభానికి ముందు ఉగ్రదాడి జరగడం ఆందోళన రేకెత్తిస్తోంది.
………..
కాశ్మీర్ ఉగ్రవాద దాడి మీద మరో కోణం బయటకు వస్తోంది. అక్కడ పరిస్థితులు ఇంకా చక్కబడలేదు అని కేంద్ర ప్రభుత్వం మొత్తుకుంటున్న వినకుండా.. అక్కడ ఎన్నికలు ఎందుకు పెట్టడం లేదు అంటూ సుప్రీంకోర్టు వెంటపడింది అని చెబుతున్నారు. అక్కడ భద్రతపరంగా కుదుటపడకుండానే ఎన్నికలకు వెళ్లిపోవడంతో శాంతిభద్రతల మీద అదుపు తప్పింది అన్న వాదన వినిపిస్తోంది. ఇప్పుడు ఈ దాడికి సుప్రీంకోర్టు బాధ్యత తీసుకుంటుందా అని కూడా కొంతమంది ప్రశ్న వేస్తున్నారు.