గతేడాది డిసెంబర్లో ఖైబర్పఖ్తూన్ రాష్ట్రంలోని శ్రీపరమ్హంసజీ మహరాజ్ ఆలయాన్ని తిరిగి ప్రారంభించారు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్.
1920లో తేరీ అనే గ్రామంలో దీన్ని నిర్మించారు. అయితే గతేడాది జమైతే ఇ ఇస్లామ్ ఫజీకి చెందిన టెర్రరిస్టులు ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఘటనపై విచారణ చేపట్టి సీజే దాన్ని పునర్నిర్మించాలని ఆదేశించారు. అంతేకాదు ధ్వంసం చేసిన వారినుంచే అందుకు కావల్సిన డబ్బులు రాబట్టాలని పాక్ సర్కారుకు సూచించారు. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న గుల్జార్ సుప్రీంకోర్టు ఎప్పటికీ మైనారిటీల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని భరోసా ఇచ్చారు. పాకిస్థాన్ హిందూ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.