
Supreme Court of India
జీవో నెంబర్ 1 విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోబోమని సుప్రీ కోర్టు స్పష్టం చేస్తూ. హైకోర్ట్ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసును జనవరి 23న విచారించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశంతో మరోసారి ఈకేసు తిరిగి ఏపీ హైకోర్టుకే రానుంది.అలాగే ఏపీ హైకోర్టు తీర్పు మెరిట్స్ పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని సీజే వ్యాఖ్యానించారు. అలాగే జీవో నెంబర్ 1పై ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ..ఇటువంటి సమయంలో ఈ కేసుపై తాము జోక్యం చేసుకోలేమని దేశ అత్యున్నత ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రకాశం జిల్లా కందుకూరులోను..గుంటూరులోను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. ఈ తొక్కిసలాటల్లో మొత్తం 11మంది చనిపోయారు. దీంతో రోడ్లపై రోడ్ షోలు, ర్యాలీలు, సభలు నిర్వహించడంపై నిషేధిస్తూ ఏపీ సర్కారు జీవో నెంబర్ 1ని జారీ చేసింది.