ప్రధాని మోదీ జీవితవిశేషాలు తెలియచేస్తూ modistory.in వెబ్ సైట్ ను ప్రారంభించారు మహాత్మాగాంధీ మనవరాలు సుమిత్రాగాంధీ. ఆయన జీవితంలో ఎదిగిన తీరు, ఆక్రమంలో ఎదురైన అనుభవాలు, స్ఫూర్తిదాయక క్షణాలను అందులో పొందుపరిచారు. మోదీతో సన్నిహితంగా మెలిగిన వ్యక్తులు చెప్పిన విశేషాంశాలను, ఇతర జ్ఞాపకాలను అందులో తెలుసుకోవచ్చు. ఒలంపిక్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా తనతో ఇంటరాక్షన్ సమయంలో నరేంద్ర మోడీ చెప్పిన విషయాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. మొత్తంగా మోడీ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలతో రూపొందించి ఓ వీడియోను గుజరాత్ భారతీయ పార్టీ శాఖ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
మోదీ జర్నీకి సంబంధించిన అనేక విషయాలు, ఆసక్తికర కథనాలు, సంఘటనల సమాహారాన్ని Modistory.in ద్వారా చూడాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ ట్వీట్టర్ వేదిగ్గా దేశప్రజలను కోరారు.