బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది భారత రక్షణ శాఖ. ఉపరితలం నుంచి ఉపరితలంలోని ప్రయోగించగల ఈ క్షిపణిని అండమాన్ నికోబార్ దీవుల్లో చేపట్టింది ఆర్మీ. నిర్దేశిత లక్ష్యాన్ని కచ్చితత్వంతో క్షిపణి ఛేధించిందని రక్షణశాఖ తెలిపింది. క్షిపణి పరీక్ష విజయవంతం అయినందుకు రక్షణశాఖను అభినందించారు ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్.చౌదరి. ప్రస్తుతం చౌదరి అడమాన్ లోనే ఉన్నారు. యుద్ధసన్నాహాలపై సమీక్షకోసం ఆయన అక్కడకు వెళ్లారు.




