అగ్ని సిరీస్లో కొత్త తరం బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని P’ని DRDO విజయవంతంగా పరీక్షించింది.
ఒడిశా తీరంలోని డా. ఏ పి జె అబ్దుల్ కలాం దీవిలో ఉదయం 11:06 గంటలకు ఈ ప్రయోగం జరిగింది.
వివిధ టెలిమెట్రీ, రాడార్, ఎలక్ట్రో-ఆప్టికల్ స్టేషన్లు సహా తూర్పు తీరం వెంబడి ఉంచిన డౌన్ రేంజ్ నౌకలు, పారామీటర్లను ట్రాక్ చేసి పర్యవేక్షించాయి.
క్షిపణి అధిక స్థాయి ఖచ్చితత్వంతో మిషన్ లక్ష్యాలను అన్నింటిని చేరుకుంది. ఇది సుమారు 2,000 కిలో మీటర్ల దూరం వరకు దూసుకపోయే సామర్థ్యం కలిగి ఉంది. క్షిపణి ని విజయవంతంగా ప్రయోగించినందుకు DRDO ను అభినందించారు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్.
https://twitter.com/DRDO_India/status/1472109557333725184?s=20