బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. కొంత కాలంగా మమతాను ప్రశంసిస్తూ వస్తున్నారు స్వామి. మమతాతో భేటీ అనంతరం టీఎంసీలో చేరతారా అన్నమీడియా ప్రశ్నకు…నేనే ఆమెతోనే ఉన్నాను,…పార్టీలో చేరాల్సిన అవసరం లేదని తనదైన శైలిలో బదులిచ్చారు.
ఢిల్లీలోని టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ నివాసంలో వీరి భేటీ జరిగింది. గత నెలలో బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి స్వామిని తొలగించిన సంగతి తెలిసింది. ఇక పలు సందర్భాల్లో మమతాను ప్రశంసించారు సుబ్రహ్మణ్యస్వామి.
అక్టోబర్లో జరిగే ప్రపంచ శాంతి సదస్సుకు మమతా బెనర్జీ రోమ్ వెళ్లాల్సి ఉండగా కేంద్రం అనుమతి నిరాకరించడంపై స్వామి విమర్శలు గుప్పించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఘటన టిఎంసి, బిజెపిల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. కొన్ని నెలల క్రితం కూడా… మమతా బెనర్జీ పక్కా హిందువు, దుర్గా భక్తురాలు . ఆమె వ్యక్తిగతం వేరు, రాజకీయం వేరు అని ట్వీట్ చేశారు స్వామి.
మరోవైపు చేరికలపై దృష్టి పెట్టిన మమతా తాజాగా…కాంగ్రెస్ మాజీ నాయకులు అశోక్ తన్వర్, కీర్తి ఆజాద్ ,జెడి(యు) మాజీ ఎంపి పవన్ వర్మలను పార్టీలో చేర్చుకున్నారు.