వెస్ట్ బెంగాల్లో టీఎంసీ అరాచకాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నాయి. ఇప్పటికే పలువురు బీజేపీ అగ్రనేతల వాహనాలను టార్గెట్ చేస్తూ దాడులు జరగగా.. తాజాగా గురువారం రాత్రి ఏకంగా కేంద్రమంత్రి కాన్వాయ్‌పైనే రాళ్లదాడికి దిగారు టీఎంసీ కార్యకర్తలు. సౌత్ కోల్‌కతా ప్రాంతంలో కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షకావత్ కాన్వాయ్‌పై రాళ్లదాడి జరిగింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ ఘటనకు పాల్పడింది టీఎంసీ గుండాలేనంటూ స్థానిక బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు.
https://twitter.com/ANI/status/1380444082279833607