
Former UPA Minister RPN Singh (File Photo)
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించిన మరునాడే కాంగ్రెస్ పార్టీని వీడారు మాజీకేంద్రమంత్రి ఆర్పీఎన్ సింగ్. తన రాజీనామా లేఖను ట్విట్టర్లోపోస్ట్ చేశారు సింగ్. నా రాజకీయ ప్రయాణంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టాను అంటూ ట్వీట్ చేశారు ఆర్పీఎన్ సింగ్. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. కొన్నిరోజులుగా బీజేపే ముఖ్యనేతలతో చర్చలు జరుపుతున్నారు.
ఆయన పార్టీని వీడుతారని నాలుగైదురోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయినా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు చేర్చింది. 15 వలోక్ సభకు కుషినగర్ నుంచి ఎన్నికైన సింగ్…2019లో బీజేపీ నేత విజయ్ కుమార్ దుబే చేతిలో ఓడిపోయారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని సర్వేలు చెబుతున్న వేళ ఆర్పీఎన్ సింగ్ పార్టీని వీడడం మరింత నష్టమేనంటున్నారు.
https://twitter.com/SinghRPN/status/1485871131085381634?s=20