రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ స్పుత్నిక్ -వి కొద్దిరోజుల్లో భారత్ లో అందుబాటులో రానుంది. మే 1న తొలి బ్యాచ్ టీకాలు భారత్ చేరుకోనున్నాయని… రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఓ ప్రకటన విడుదల చేసింది. భారత ఔషధ నియంత్రణ సంస్థ కొద్ది రోజుల క్రితమే స్పుత్నిక్ -వి టీకాకు అత్యవసర అనుమతులు జారీ చేసింది.
రష్యాలోని గమలేయా ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాను భారత్లో రెడ్డీస్ ల్యాబ్స్ సంస్థ ఉత్పత్తి, పంపిణీ చేయబోతోంది. వేసవి చివరి నాటికి భారత్లో నెలకు 5కోట్ల డోసులు ఉత్పత్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.