సంచిక పత్రిక తెలుగులో మొట్టమొదటి క్రీడా కథల సంకలనం ప్రచురించే సంకల్పం వెనుక వున్న ఉద్దేశ్యం కస్తూరి మురళి కృష్ణ గారి మాటల్లో.
సంచిక గతంలో దేశభక్తి కథలు , తెలుగు కథల్లో గాంధీ గారు లాంటి వినూత్నమైన కథల సంకలనాల్ని అందించి, ఇప్పుడు క్రీడా కథల సంకలనం వైపు సాగిపోతుంది.
తెలుగు కథా ప్రపంచంలో కథలు రాసేవారు అకాడమిక్ లు
జర్నలిస్ట్ లు ఉండటం చేత చాలా వరకు సమాజం అణచి వేత , సమాజం లోని అసమానతలు గురించి రాయటం చేసేవారు. ఈ కథా సంకలనంలో 23 కథలు వున్నాయి.
నాంది , ప్రస్తావన కాకుండా ఈ క్రింది భాగాలుగా కథలని ఎలా విభజించారో వినగలరు.
క్రీడా స్ఫూర్తి
క్రీడా మానసికం
క్రీడా వినోదం
క్రీడా ఉన్మాదం
క్రీడా నేరం
Sports Stories By Kasturi Murali Krishna