ప్లే గ్రౌండ్ అంటే సందడిగా ఆడుకునే పిల్లలు గుర్తొస్తారు. కానీ స్టూడెంట్స్ బదులు టీచర్స్ ,, లెక్చరర్సే స్వయం గా గ్రౌండ్ లోకి దిగితే ఆ లెక్కే వేరు కదా. ఎదిగిన టీచర్స్ లెక్చరర్స్.. తమ వయస్సు పక్కన పెట్టేసి గ్రౌండ్లో దిగి ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది కదా.
…..
బెంగళూరు వేదికగా సౌత్ ఇండియా టీచర్స్, లెక్చరర్స్ కి స్పోర్ట్స్ డే నిర్వహించారు. ఫ్యాకల్టీ కి “ఎలెన్ సన్మాన్” పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో వందల సంఖ్యలో లెక్చరర్స్ పాలుపంచుకున్నారు. క్రికెట్, షటిల్, టెన్నిస్ .. ఒకటి ఏమిటి .. అనేక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో చెలరేగిపోయారు. క్లాస్ రూమ్ టెన్షన్ లను పక్కన పెట్టేసి,, సందడి సందడి చేసేసారు.
…….
మహిళా ఫ్యాకల్టీ కూడా సందడిలో ఏమాత్రం తీసిపోలేదు. నచ్చిన ఆటలు ఎంచుకొని పోటీ పడుతూ గేమ్స్ ఆడే సారు. అసలైన ఆటల సందడిని అక్షర సత్యం చేసేసారు. గ్రౌండ్లో ఫుల్ జోష్ చూపించారు.
…..
ఇక చివరి రోజు కార్యక్రమం కన్నుల పండువ గా సాగింది. ముగింపు ఫెస్ట్ లో కల్చరల్ ప్రోగ్రామ్స్ అదిరిపోయాయి. ఫ్యాకల్టీ అంతా సందడి సందడిగా రీఛార్జ్ అయిపోయారు. ఆటపాటలతో రోజంతా సందడి చేసేసారు.
………
సీరియస్ గా పాఠాలు చెప్పే ఫ్యాకల్టీకి కూడా రీఛార్జ్ అవసరం. సన్మాన్ పేరుతో జరిగిన ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ తో ఫ్యాకల్టీ అంతా ఫుల్ రీఛార్జ్ అయిపోయారు. నిర్వహణకు నడుము కట్టిన టీం కి థాంక్స్ చెప్తూ పాఠాలు చెప్పేందుకు ఫుల్ ఎనర్జీతో క్లాస్ రూమ్ కి వచ్చేశారు.
More Photos :