జార్ఖండ్ లోని హేమంత్ సోరెన్ ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గింది. ఆయనకు మద్దతుగా 48 ఓట్లు వచ్చాయి. బీజేపీ సభ్యులు వాకౌట్ చేయడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. 81 స్థానాలున్న జార్ఖండ్ అసెంబ్లీలో జేఎమ్ఎమ్ కు 30, కాంగ్రెస్ కు 18, ఆర్జేడీకి1, ఎన్సీపీకి 1, సీపీఐఎంఎల్ కు ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. విపక్ష బీజేపీకి 26, ఏజేఎస్యూకు 2, ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలున్నారు. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కావల్సిన మ్యాజిక్ నెంబర్ 41 కాగా…జేఎంఎం కూటమికి 48 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. అసెంబ్లీ సాక్షిగా విశ్వాస పరీక్ష నెగ్గినా సోరేన్ మెడపై అనర్హత కత్తి వేలాడుతోంది. సొరేన్ అనర్హతపై ఈసీఐ ఇప్పటికే గవర్నర్కు నివేదిక పంపించింది. సొరేన్ పై వేటు తప్పకపోవచ్చంటున్నారు.