లక్నో ఐపీఎల్ ఫ్రాంచైజీకి మెంటార్ గా నియమితులైన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ పై, ప్రధానిమోదీపై సోనీ స్పోర్ట్స్ చేసిన ట్వీట్ కలకలం రేపుతోంది. అయితే కాసేపటికే ఆ అభ్యంతరకర పోస్టును డిలిట్ చేసింది సోనీ స్పోర్ట్స్ .
లక్నో ఫ్రాంచైజీ గంభీర్ ను మెంటార్ గా నియమించారంటూ @CricCrazyJohns అనే ఖాతాదారు చేసిన ట్వీట్ కు సోనీ ‘మాజీ క్రికెట్ కు సుప్రీం లీడర్ తగినంత వేతనం ఇవ్వడం లేదా’ అంటూ ట్వీట్ చేసింది. గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీ. అంటే ప్రధాని నరేంద్రమోదీని సుప్రీం లీడర్ గా ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. అయితే ట్రోలింగ్ మొదలవడంతో వెంటనే ట్వీట్ ను తొలగించేసింది. దానిపై ఎలాంటి వివరణ గానీ, వ్యాఖ్యకు క్షమాపణ కానీ చెప్పలేదు సోనీ నెట్ వర్క్.
కాసేపటికే సంజీవ్ గోయెంకా , RPSG గ్రూప్ ట్విట్టర్లోకి వెళ్లాడు గంభీర్. పోటీలో గెలవాలనే ఫైర్ ఇప్పటికీ నాలో ఉంది. అయితే నేను డ్రెసింగ్ రూమ్ కోసం పోటీపడను..ఉత్తరప్రదేశ్ ఆత్మగా యూపీ ఆత్మకోసం పోరాడుతానని ట్వీట్ చేశాడు.
“Thanks a lot to Dr Goenka and the RPSG Group for presenting me this wonderful opportunity in their setup. “The fire to win a contest still burns bright inside me, the desire to leave a winner’s legacy still kicks me 24×7. I will not be contesting for a dressing room but for the spirit and soul of Uttar Pradesh,”
గంభీర్ ది మచ్చలేని కెరియర్ అని…క్రికెట్ పట్ల అతని ఆరాధనను గౌరవిస్తానని…అతనితో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తూ ఉంటానని సంజీవ్ గోయెంకా ట్వీట్ చేశారు. కెప్టెన్గా కోల్కతా నైట్రైడర్స్ని రెండు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు గంభీర్. గత అక్టోబరులో రూ.7090 కోట్లకి బిడ్ వేసి లక్నో ఫ్రాంఛైజీని ఆర్పీఎస్జీ గ్రూప్ దక్కించుకున్న విషయం తెలిసిందే. గంభీర్ ను మెంటార్ గా నియమించుకున్న సంజీవ్ గోయెంకా ఫ్రాంచైజీ జింబాబ్వే మాజీ కెప్టెన్ ఆండీ ఫ్లవర్ ను ప్రధాన కోచ్ గా తీసుకుంది.
https://twitter.com/iMac_too/status/1472131766085308418?s=20
https://twitter.com/GautamGambhir/status/1472142230437593088?s=20