కరోనా విపత్తులో పేద ప్రజల కష్టాలు తీర్చడంలో ముందున్నసెలబ్రిటీ నటుడు సోనూసూద్. తాజాగా కోవిడ్ పేషెంట్ల కష్టాలు ఆయన్ని కదిలించాయి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత వేధిస్తోంది.
ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేయడంతో పాటు… రాష్ట్రాల్లో ఆక్సిజన్ సిలిండర్లు నెలకొల్పాలని ఆయన నిర్ణయించారు.
అందుకు కావల్సిన సామగ్రినీ ఫ్రాన్స్ సహా ఇతర దేశాలనుంచి ఎగుమతి చేస్తున్నారు. మరో 10 రోజుల్లో కరోనా ఎక్కువగా విజృంభిస్తున్న రాష్ట్రాల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్టు సోనూ సూద్ చెప్పారు. ఫస్ట్ వేవ్ సమయంలో కూడా ఎంతో మందిని ఆదుకున్నారు సోనూసూద్. ముఖ్యంగా వలసకూలీలను సొంత రాష్ట్రాలకు చేర్చడం కోసం సొంత బస్సులు ఏర్పాటు చేయడమే కాదు దగ్గరుండి బస్సెక్కించి స్వస్థలాలకు పంపారు.