బ్రిటీష్ వాళ్లు వెళ్లిపోయి చాలా సంవత్సరాలు అవుతోంది. కానీ, బ్రిటీష్ కు దగ్గరగా ఉండే ఇటలీ దేశస్తులు ఇక్కడే ఉన్నారు అన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే కొంత కాలంగా కాంగ్రెస్ పూర్వ అధ్యక్షులు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్ గాంధీ ఈ దేశాన్ని, వ్యవస్థలను అదే పనిగా అవమానిస్తున్నారు. విదేశీ మూలాలు కలిగిన కుటుంబం కావటంతో, ఇక్కడ నాయకులు.. వాళ్లకు కనీసం మనుషుల్లా కూడా కనిపించటం లేదు. అందుచేతనే ఏకంగా ఈ దేశాధ్యక్షురాలిని అనకూడని మాటలు అనేశారు.
..
పార్లమెంటు సమావేశాలు సందర్బంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చక్కటి ప్రసంగం చేశారు. దేశ ప్రజల్ని ఉద్దేశించి పార్లమెంటు వేదికగా ప్రభుత్వం తరపున మాట్లాడటం ఆనవాయితీ. ఇందులో భాగంగా ప్రభుత్వ విధానాలను రాష్ట్రపతి ప్రజలకు వివరించటం జరుగుతుంది. దీనిని సాధారణంగా ప్రభుత్వం తరుపు నాయకులు స్వాగతిస్తూ ఉంటారు. ప్రతిపక్షాలు మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటాయి. అంత వరకు ఓకే కానీ, రాష్ట్రపతిని వ్యక్తిగతంగా ఇప్పటివరకు ఎవరూ ఏమీ అనలేదు. ఎందుకంటే రాష్ట్రపతి సీటులో ఎవరు కూర్చొన్నా మన అందరికీ నాయకులు అని గుర్తించుకోవాలి.
…
కానీ ఈ సారి రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ దేశానికి అధ్యక్షురాలు అయిన ద్రౌపది ముర్ముని.. పూర్ లేడీ అని సోనియా గాంధీ సంబోధించారు. పార్లమెంటులో ఆమె ఎక్కువ సేపు ప్రసంగించలేక పోయారు అని హేళన చేశారు. పూర్ థింగ్ అంటూ కామెంట్లు విసిరారు. ద్రౌపది ముర్ము గురించి చాలా హీనంగా మాట్లాడి ఆమె వెళ్లిపోయారు. ఈ విషయం మీద దేశ వ్యాప్తంగా చర్చ రేకెత్తింది. అయినప్పటికీ, తప్పు తెలుసుకొని సారీ చెప్పేందుకు కూడా సోనియాగాంధీ ముందుకు రాలేదు
…
దీని మీద బడుగు బలహీన వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. గిరిజన మహిళ ను రాష్ట్రపతిగా చూసేందుకు సోనియాగాంధీ ఇష్టపడటం లేదన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుచేతనే ఆమె పట్ల ఈ మాదిరిగా నిరసన చూపుతున్నారు అని అంటున్నారు. గతంలో కూడా పార్లమెంటరీ కార్యకలాపాల్లో భాగంగా ద్రౌపది ముర్ము ని అదే విధంగా సోనియా అండ్ టీమ్ అవమానించారు అని అంటున్నారు. దీని మీద ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ జరగుతోంది.
….
దీని మీద రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటన జారీ చేసింది. రాష్ట్రపతి ని ఉద్దేశించి కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరం అని అభిప్రాయపడింది. పార్లమెంటు ప్రసంగంలో రాష్ట్రపతి ముర్ము ఎక్కడా అలసి పోలేదని స్పష్టం చేశారు. ప్రసంగం సజావుగా పూర్తి చేసి వెనక్కి వచ్చారని వివరించారు. అయినప్పటికీ, ఇటువంటి వ్యాఖ్యలు చేయటం తగని పని అని రాష్ట్రపతి వర్గాలు అభిప్రాయ పడ్డాయి.
…
ఈ విషయం మీద పార్లమెంటు లో పోరాడాలని బీజేపీ నిర్ణయానికి వచ్చింది. రాజ్యసభ లో సభా హక్కుల తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ బీజేపీ ఎంపీలు నోటీసులు అందించారు. పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఎంపీ సోనియా గాంధీ వ్యాఖ్యలు రాష్ట్రపతి హోదాకు, ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయిని.. ఈ అంశానికి ఉన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకుని ఆమెపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మన్‌ను కోరారు.
..
మొదటనుంచి భారతీయులను చిన్నచూపు చూడటం ఐరోపా దేశస్తులకు అలవాటు, అదే క్రమంలో సోనియాగాంధీ కూడా ఇక్కడ నాయకులను అవమానిస్తున్నారు అని అంటున్నారు. కాంగ్రెస్ నాయకులను కూడా చాలా దూరం పెట్టి, చులకనగా మాట్లాడుతూ ఉంటారు అని ఢిల్లీ వర్గాల్లో టాక్. ఇప్పుడు ఏకంగా దేశాధ్యక్షులనే అవమానించటంతో అసలు రంగు బయట పడిపోయింది.