సొనాల లో శ్రీ రామాలయం లో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోబోతుంది.
గత కొన్ని సంవత్సరాలుగా శ్రీ రాములోరి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి,
ఇట్టి కార్యక్రమం 9 రోజులు జరగబోతున్నాయి.
ఈ కార్యక్రమం లో సొనాల చుట్టూ ప్రక్కల గ్రామాల ప్రజలు, పెద్దఎత్తున భక్తులు పాల్గొంటారు.
మహిళలు మంగళ హారతులు స్వాగతం పలుకుతూ గ్రామ పుర వీధుల్లో స్వామి వారి వాహనం ఊరేగింపుగా వెళుతుంది.
చంద్ర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం అనగా 26 తేది నుండి వచ్చే నెల 5 వ తేది వరకు నిర్వహించబడును.
సోమవారం ద్వజారోహణ యజ్ఞ హోమధి కార్యక్రమాలు గోపూజతో ప్రారంభమవుతాయి.
మంగళవారం నుండి ప్రతిరోజు సాయంత్రం స్వామివారు ఆరు గంటల నుండి పురవీధుల్లో విహరిస్తారు. ప్రతిరోజు రథోత్సవం జరుగుతుంది.
రథోత్సవం తర్వాత స్వామి వారి ప్రసాద వితరణ పంపిణీ జరుగతుంది.
చివరగా దసరా రోజు స్వామివారికి అభిషేకాలు చక్రస్నానం కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాల ముగింపు జరిగి దసరా వేడుకలు ప్రారంభమవుతాయి ఇట్టి కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు స్వామివారి యొక్క ఆశీర్వచనాలు పొందుతారు.
స్వామివారి రథోత్సవ సమయంలో వివిధ కళారూపాలు ప్రదర్శించబడతాయి.
ఊరు ఊరంతా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక వాతావరణంలోకి వెళుతుంది.