
ప్రస్తుతం పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుతూ వృధా ఖర్చు చేస్తున్నటువంటి సందర్భంలో సోనాల మండలంలోని సాకేర గ్రామానికి చెందిన యువ నాయకుడు జాదవ్ పవన్ వినూత్నంగా తన జన్మదినం సందర్భంగా సాకేర గ్రామములో కళావతి రక్త నిధి సెంటర్ ద్వార రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ రక్తదాన శిబిరంలో 25 మంది పలువురు రక్తదానం చేయడం జరిగింది.
రక్తదానం చేయడమే కాకుండా భైంసా ఐక్యత సేవా సమితి ద్వారా అనాధలకు వృద్ధులకు అన్నదానం, గోమాతలకు పశుగ్రాసాన్ని అందించి అందరికీ ఆదర్శమయ్యాడు.
జాదవ్ పవన్ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం అనే దానితో ముందుకు వెళ్ళాలి అని రక్తదానం చేయడం వల్ల పురుషులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది అని ఒక్క రక్తదానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుందని రక్తదానం చేయడం వల్ల రక్త కణాలను పొందిన వ్యక్తికి ప్రయోజనం చేకూర్చడమే కాకుండా దాత ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని అన్నారు.
అత్యవసర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు అవ్వాలి అని అన్నారు.
జన్మదిన సందర్భంగా భైంసా ఐక్యత సేవా సమితి ద్వారా గోవులకి పశుగ్రాసం, పేద ప్రజలకు అన్నదానం చేసే అవకాశం కల్పించిన ఐక్యత సేవాసమితికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని జాదవ్ పవన్ అన్నాడు.
ఈ కార్యక్రమంలో బోథ్ ఎస్సై శ్రీ సాయి,తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్,సర్పంచ్ మోతి సింగ్,ఉప సర్పంచ్ రాథోడ్ భీమ్ రావ్,నాయకులు గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు…
More Photos:







