దేవాలయాలలో భజన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సామాజిక సమరసత సాకారం చేసుకోవచ్చు. ఇందులో భాగంగా మన తెలంగాణ లో భజన కార్యక్రమాలు ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని సోనాల రామాలయంలో నిత్య భజనలు నిర్వహించారు .
ఈ సందర్భంగా సీతారామ భజన మండలి కళాకారులకు,
రామాలయ కమిటీ చైర్మన్
జి.వి రమణ ఆధ్వర్యంలో సత్కారాలు జరిగాయి.
భజన కళాకారుల సేవలు నిరుపమానమని,
గ్రామమంతట ఆధ్యాత్మిక వాతావరణం, భక్తి భావాలను వెదజల్లారని స్థానిక పెద్దలు పేర్కొన్నారు. భజన కళ అంతరించిపోకుండా భవిష్యత్తు తరాల వారికి అందించాలని కోరారు.
ఈ సందర్భంగా భజన కళాకారులకు అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడానికి సోనాల గ్రామ మాజీ సర్పంచ్ చెట్లపల్లి సదానందం పదివేల రూపాయల విరాళాన్నీ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు , భక్తులు పాల్గొన్నారు.