అమెరికా సంయుక్త రాష్ట్రాలను మంచు వణికిస్తోంది. కెనడాలో కూడా బాంబ్ సైక్లోన్ బీభత్స సృష్టిస్తోంది. ఎక్కడిక్కడ అడుగుల మేర మంచు పేరుకుపోయి ఉంది. అమెరికాలో దాదాపు 20 కోట్ల మంది బాంబ్ సైక్లోన్ తుపాను ప్రభావితులైనట్టు అంచనా. అంటే మూడింట రెండువంతుల మందిని మంచు ఇబ్బందిపెడుతోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి లక్షలాదిమంది అవస్థలు పడుతున్నారు. మాంటెన్నా, నార్త్ డకోటా, సౌత్ డకోటా, మిషిగాన్, ఇండియానా, మిన్నెసోటా,నెబ్రాస్కా, విస్కిన్సన్, న్యూయార్క్ ప్రాంతాలపై మంచు తుపాను ప్రభావం అత్యధికంగా ఉంది. ఈ రాష్ట్రాల్లో యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.