కర్నాటకలో ఆరు ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. బెళగావి సువర్ణసౌధలో ముఖ్యమంత్రి బొమ్మైఅధ్యక్షతన మంత్రివర్గ భేటీ జరిగింది. మరికొన్ని కీలక అంశాలతో పాటు..బెంగళూరులో టీ జాన్ యూనివర్సిటీ, రాష్ట్ర వక్కలింగ సంఘం యూనివర్సిటీ, సప్తగిరి యూనివర్సిటీ, ఆచార్య యూనివర్సిటీ, దావణగెరెలో జీఎం సిద్దేశ్వర యూనివర్సిటీ, బళ్లారిలో కిష్కింధ యూనివర్సిటీలకు ఆమోదం తెలిపారు.వీటికి సంబంధించిన బిల్లులను ప్రస్తుతం సమావేశాల్లోనే ఆమోదించనున్నారు.