మహిళా సాధికారత గురించి చాలామంది మాట్లాడటం వింటుంటాం. కానీ దానిని ఆచరణ లోనికి తీసుకుని రావడం చాలా కష్టమైన పని. పారిశ్రామిక రంగంలో,, వ్యాపార రంగం లో పురుషుల అధిపత్యం చాలా కాలం నుంచి ఉంది. సహజంగానే ఇటువంటి చోట మహిళలకు అవకాశాలు తక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో పెద్దగా పారిశ్రామికవేత్తలు లేని సందర్భాల్లో.. యువత వ్యాపార రంగంలోకి రావడం కష్టమే.. నిలదొక్కుకోవడం కష్టమే.
ఇటువంటి పరిస్థితులను గమనించిన ఇద్దరు అక్కచెల్లెళ్ళు వినూత్న మార్గంలో చొరవ చూపుతున్నారు. విజయవాడకు చెందిన సామాజికవేత్త కొత్తూరు జగన్మోహన్ రావు కి ఇద్దరు కూతుళ్లు. అబ్బాయిలకు తీసిపోని విధంగా ఇద్దరినీ చదివించారు. సాదా సీదా మార్గాలను విడిచిపెట్టి ఇద్దరినీ వ్యాపార రంగంలో ప్రోత్సహించారు. కొత్తూరు స్నేహ మరియు కొత్తూరు శ్వేత ఇద్దరూ వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. ఇందులో కొత్తూరు స్నేహ ఇప్పటికే అనేక ప్రాజెక్టుల్లో సక్సెస్ కావడం జరిగింది . ప్రస్తుతం అమెరికాలోని ఫ్లోరిడా లో ప్రాజెక్టులు నిర్వహిస్తూ తమ బాటలో ఇతర మహిళలని ప్రోత్సహిస్తున్నారు.
ఇక కొత్తూరు శ్వేత మరో అడుగు ముందుకేసి మహిళా పారిశ్రామికల వేత్తల కోసం, మహిళా వ్యాపారుల కోసం వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళా వ్యాపారులు ఎదుర్కొనే పెద్ద సమస్య మార్కెటింగ్ మరియు అమ్మకాలు. ఈ సమస్యను అధిగమించేందుకు కొత్తూరు శ్వేత.. నిర్ణీతమైన రంగాలలో ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. మహిళల ఉత్పత్తులు అయిన జ్యువెలరీ , ఆభరణాలు, శారీస్, డ్రెస్ మెటీరియల్ వంటి రంగాలకు పెద్దపీట వేస్తున్నారు .
హైదరాబాదులోని ముఖ్యమైన ప్రాంతాలలో స్వయంగా ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి, మహిళా వ్యాపారులను పిలిపించి వాళ్ల ఉత్పత్తులను ప్రదర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. తద్వారా ఆయా మహిళలు తమ తమ వ్యాపారాలలో ముందంజ వేసేందుకు అవకాశం కలుగుతోంది.
తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లో జ్యువెలరీ ఎగ్జిబిషన్ కు శ్రీకారం చుట్టారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచే కాకుండా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్ వంటి నగరాలకు చెందిన పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ద్వారా పెద్ద ఎత్తున సేల్స్ జరుగుతాయని ఆశిస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ కు విజిటర్స్ ను పెంచేందుకు మంత్రులు, ఐ ఎ ఎస్ అధికారులను అతిథులుగా ఆహ్వానిస్తున్నారు.
ఈ సందర్భంగా కొత్తూరు శ్వేత మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించగలరు అన్నది తమ బలమైన నమ్మకం అని చెప్పారు . అదే స్ఫూర్తితో అక్క చెల్లెలు అయిన తామిద్దరూ ఎదుగు తున్నామని వివరించారు. ఈ క్రమంలో ఇతర మహిళలకు కూడా ప్రోత్సాహం అందించేందుకు ఇటువంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ద్వారా సేల్స్ చేసుకునేటందుకు అవకాశాలు ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాగల కాలంలో దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఎగ్జిబిషన్ లు పెట్టాలని యోచిస్తున్నారు. ఈ కామర్స్ ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తామని, ఫలితంగా ఎన్ ఆర్ ఐ లతో సంబంధాలు పెరుగుతాయని శ్వేత వివరించారు.