ఉత్తర్‌ప్రదేశ్ మౌ జిల్లా దోహ్రిఘాట్ సమీపంలో.. ఘాగ్రా నదినుంచి వెండి శివలింగం లభ్యమైంది.దానిబరువు 53 కిలోలు. స్థానికుడైన రామ్మిలాన్ రోజూ నదీ స్నానానికెళ్తుంటాడు. ఆదివారం ఉదయం స్నానం చేశాక.. తాను తెచ్చిన పూజకు సంబంధించిన నీటి బిందెను శుభ్రం చేద్దామని కొంచెం మట్టిని తీశాడు. అప్పుడు చేతికి ఏదో తగిలినట్లు అనిపించింది. వెంటనే చేతితో మట్టిని తవ్వడం ప్రారంభించాడు. సమీపంలో చేపలు పడుతున్న ఇద్దరు జాలరులు పిలిచి కాస్తలోతుగా తవ్వగా.. భారీ వెండి శివలింగం కనిపించింది.
రామ్మిలాన్ వెండి శివలింగాన్ని వారి గ్రామంలో ఉన్న పురాతన శివాలయానికి తీసుకెళ్లాడు. రుద్రాభిషేకం నిర్వహించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులంతా శివలింగాన్ని చూడడానికి ఎగబడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు.. శివలింగాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే, శివలింగాన్ని చూసేందుకు ప్రతి ఒక్కరికీ అనుమతిస్తామని పోలీసులు.