కామన్వెల్త్ గేమ్స్ లో 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా అవినాష్ సాబ్లే నిలిచాడు.కామన్వెల్త్ గేమ్స్ 2022లో పురుషుల 3,000 మీటర్ల స్టీపుల్‌చేజ్ ఈవెంట్లో 27 ఏళ్ల అవినాష్ 8:11.20 టైమింగ్ తో రజత పతకాన్ని గెలిచాడు. అవినాష్ 0.05 సెకన్ల తేడాతో బంగారు పతకాన్ని కోల్పోయాడు. కెన్యా ఆటగాడు అబ్రహం కిబివోట్ 8:11.15 సెకన్లతో స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
కామన్వెల్త్ గేమ్స్ లో స్టీపుల్‌చేజ్ లో రజతం గెలిచినందుకు అవినాష్ సాబుల్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. మీరు నిలకడగా మీ పనితీరు స్థాయిని పెంచుకుంటున్నారు, ఇది మీ విజయానికి స్ఫూర్తిదాయకమైన అంశం. మీ భవిష్యత్ ప్రయత్నాలకు నా శుభాకాంక్షలని ఆమె ట్వీట్ చేశారు.
Congratulations to Avinash Sable for winning silver at Steeplechase in #CommonwealthGames. You have been consistently raising your level of performance which is an inspiring aspect of your success. My best wishes to you for your future endeavours.
— President of India (@rashtrapatibhvn) August 6, 2022