బుల్డోజర్. యూపీ ఎన్నికల్లో నాయకుల కంటే ఎక్కువగా ఈ పేరు వినిపించింది. యోగీ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వాళ్లను ఖాళీచేయించారు. అనేక అక్రమ నిర్మాణాలని బుల్డోజర్లతో తీయించేశారు. దీంతోబుల్డోజర్ యోగీ సర్కారుకు ఓ మార్క్ గా మారింది. యోగీ మళ్లీ సీఎం అయితే కనుక అందరి మీదకు బుల్డోజర్లు పంపిస్తాడన్న విపక్షాల ఆరోపణలేవీ ఎన్నికల్లో పనిచేయలేదు. తిరిగి యోగీ నేతృత్వంలోని బీజేపీకే యూపీ ప్రజలు పట్టం కట్టారు. దీంతో మరింత బుల్డోజర్ పేరు అక్కడ మార్మోగుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీకి చెందిన కొందరు ఆయనకు బుల్డోజర్ చిత్రాలను బహుకరిస్తుండడం విశేషం. రాష్ట్రానికి చెందిన ఓ స్థానిక వ్యాపారి ఏకంగా వెండితో చేసిన బుల్డోజర్ ప్రతిమను యోగీకి కానుగ్గా అందజేశారు. ఇప్పుడా వార్త, వెండి బుల్డోజర్ ఫొటోలు అక్కడ సోషల్మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.