ఆదిలాబాద్ లోని నేరడిగొండ మండల కేంద్రంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, హిందూ వాహిని, శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానికంగా పెద్ద హనుమాన్ ఆలయం దగ్గర, అంబేద్కర్ కూడలి, నూతన హనుమాన్ ఆలయం, అలాగే శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాల ప్రాంగణంలో గోపికల వేషధారణలో, శ్రీ కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఉట్టి కొట్టే కార్యక్రమం అనంతరం నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం గ్రామస్తులకు కనువిందు చేసింది. చాలా మంది చిన్ని క్రిష్ణులతో, గోపికలతో సెల్ఫీలు దిగారు.