షాకింగ్.. అయోధ్య మసీదు నిర్మాణ స్థలం భూమి మాదేనంటూ కోర్టుకెక్కిన ఆ ఇద్దరు..!
అయోధ్యలో మసీదు నిర్మాణం కోసం కేటాయించిన ఐదెకరాల స్థలం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఆ మసీదుకు కేటాయించిన భూమి తమదేనంటూ ఢిల్లీకి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆరోపిస్తున్నారు. అంతేకాదు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు.
దేశ విభజన సమయంలో 1947లో తమ తండ్రి గ్యాన్ చంద్ర భారత్‌కు వచ్చారని.. అనంతరం ఫైజాబాద్ జిల్లాలో స్థిరపడ్డారని పిటిషన్లో పేర్కొన్నారు. ఆ తర్వాత అప్పటి అధికారులు తమ తండ్రికి ధన్నిపూరం గ్రామంలో 28 ఎకరాల స్థలాన్ని కేటాయించారని తెలిపారు. కొంత కాలం తర్వాత రెవెన్యూ రికార్టుల నుంచి తమ తండ్రి పేరును తొలగించారని ఆరోపించారు. ఈ విషయంపై సెటిల్మెంట్ అధికారికి ఫిర్యాదు చేశామని.. అప్పుడు తమ 28 ఎకరాల భూమి నుంచి 5 ఎకరాలను సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేటాయించారని తెలిపారని వెల్లడించారు. అయితే
తమ స్థలం తిరిగి తమకే అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు ఎలా స్పందిస్తున్నదన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.