మత మార్పిడులకు పెట్టింది పేరైన కల్వరి గ్రూపుకి షాక్ తగిలింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కేంద్రంగా అక్రమాలకు పాల్పడుతున్న కల్వరి చర్చిని కూల్చివేతకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ మైనార్టీ శాఖ నోటీసు జారీ చేసింది.
దీని వెనక చాలా స్పష్టమైన కారణాలు కనిపిస్తున్నాయి.
డాక్టర్ సతీష్ కుమార్ నేతృత్వంలోని చర్చి పన్నులు చెల్లించడం లేదని, అలాగే దశమ భాగాలుగా పెద్ద మొత్తంలో వసూళ్ల దందా చేస్తున్నాయి. పేదలకు కిరాణా సామాను అందిస్తూ… తప్పుడు బోధనలను ప్రచారం చేస్తున్నారు . అలాగే హిందువులను అడ్డదారిలో క్రైస్తవులుగా మార్చేస్తున్నారు.
ఈ విషయం మీద ఫిర్యాదు నమోదు అయింది. గుంటూరు వసంతరాయపురంలో వుండే ఓ వ్యక్తి … కల్వరి చర్చిపై ఐదు ఆరోపణలు చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో చర్చి అక్రమ కార్యకలాపాలు, పంచాయతీరాజ్, రెవిన్యూ, పోలీస్ శాఖ, శబ్ద కాలుష్య నియంత్రణ మండలి వంటి కీలకమైన శాఖల అనుమతులే లేవని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కల్వరి గ్రూప్ వ్యవస్థాపకుడు పి. సతీష్ కుమార్ అపర కోటీశ్వరుడు. ఇది ఆసియాలోనే పెద్ద చర్చి అంటూ నడిపిస్తున్నాడు. 2005 లో దాదాపు 20 మందితో ప్రారంభమై, ఇప్పుడు మొత్తం 4 లక్షల మంది సభ్యులుంటారు. ఏ కార్యక్రమం జరిగినా 20 వేల మంది హాజరవుతుంటారు.ఓ వైపు మత ప్రచారం చేస్తూనే… సేవ అన్న ముసుగులో కల్వరి హాస్పిటల్, కల్వరి బైబిల్ కళాశాల,కల్వరి పాఠశాలలంటూ కూడా నిర్వహిస్తున్నాడు. క్రైస్తవ వర్గంలో సతీష్ కుమార్ అత్యంత పలుకుబడి కలిగిన పాస్టర్. అంతర్జాతీయంగా కూడాపేరుంది.
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఈ ఫిర్యాదు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ప్రభుత్వ యం త్రాంగ దర్యాప్తు చేసి ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని నిర్ధారణ చేసింది. దీంతో
అనేక అక్రమాలకు పాల్పడుతున్న ఈ చర్చి ని కూల్చివేయాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.