జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో బయటపడిన శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటని విశ్వహిందూ పరిషత్ చీఫ్ అలోక్ కుమార్ అన్నారు. దాన్ని హిందూ పక్షం నిరూపించగలదన్నారు.
“ఈ విషయం సంక్లిష్టంగా ఉంది.. దీనికి అనుభవజ్ఞుడైన న్యాయమూర్తి అవసరమని మేం సుప్రీంకోర్టుతో అంగీకరిస్తున్నాం. జిల్లా కోర్టు దీనిని పరిశీలిస్తుందని కోర్టు పేర్కొంది. మేం సుప్రీంకోర్టుతో ఏకీభవిస్తున్నాం” అని ఆయన అన్నారు.
“నంది అటువైపే చూస్తున్నందున అది కశ్చితంగా శివలింగమని మేం నమ్ముతున్నాం, 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి అని జ్ఞానవాపి మసీదు సముదాయంలోని వజుఖానాను మొఘలులు ఆక్రమించిన దేవాలయ శిధిలాల మీద నిర్మించారని ఆ ప్రదేశం సూచిస్తుంది.
మేం దానిని కోర్టుకు నిరూపించగలం.. ఈ కేసును సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. స్థానిక కమిషనర్ నివేదికను తీసుకునే అధికారం న్యాయమూర్తికి ఉంది. ఇది అసలు జ్యోతిర్లింగమని మేం నిరూపిస్తాం”అని ఆయన అన్నారు.
“జ్ఞాన్వాపి మసీదు కేసుకు ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) 1991 చట్టం వర్తించదని వీహెచ్పీ నేత పేర్కొన్నారు. ఎందుకంటే మతపరమైన స్థలం మరొక చట్టం కింద విచారణ నడుస్తుంటే ఈ చట్టం ఆ కేసుపై వర్తించదని 1991 చట్టం పేర్కొంది. ఇప్పటికే కాశీ విశ్వనాథ ఆలయానికి ప్రత్యేక చట్టం ఉంది, సుప్రీంకోర్టు కూడా ఈ కేసు విచారణను ఆ చట్టం నిరోధించదని సూచించింది” అని అన్నారు.