వివాదాస్పద సంబాలా పట్టణం అసలు రూపం బయటపడుతోంది. అక్కడ వివాదాస్పద బాబ్రీ మసీదు ప్రాంతంలోనే ఇప్పుడు శివాలయం బయట పడింది. స్పష్టమైన శివలింగం, నంది విగ్రహం, హనుమాన్ విగ్రహం దర్శనం ఇచ్చాయి.
సంబాలా పట్టణంలో బాబర్ నిర్మించిన మసీదు చాలా ప్రసిద్ధి కెక్కినది. భారతీయ గడ్డ మీద బాబర్ నిర్మించిన మొదటి మసీదు ఇదే. చాలా చోట్ల దేవాలయాలను కూల్చేసి, బాబర్ స్వయంగా మసీదులను నిర్మించారు అనేందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఇదే క్రమంలో ఇక్కడి బాబ్రీ మసీదు కూడా దేవాలయ పునాదుల మీద నిర్మించినదే అన్న వాదన ఎప్పటి నుంచో ఉంది. కొన్ని రోజుల క్రితం ఇదే వాదనలతో స్థానిక న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు అయింది. రెండు వైపులా వాదనలు విన్న తర్వాత న్యాయస్థానం ఒక ప్రతిపాదన చేసింది. రెండు పక్షాల న్యాయవాదుల సమక్షంలో కోర్టు కమిషనర్ అక్కడకు వెళ్లి పరిశీలన చేయాలని నిర్ణయం తీసుకొంది.
Big news from Sambhal: A hidden Shiv temple has been discovered after 46 years during a police raid.
When the Muslim population in the area grew, the remaining Hindus migrated, and the temple was locked by Muslims.
The police conducted a raid in the area following complaints of… pic.twitter.com/kpjasH6U40
— Mr Sinha (@MrSinha_) December 14, 2024
అంత వరకు బాగానే ఉంది కానీ, కోర్టు కమిషనర్ బాబ్రీ మసీదు దగ్గర అడుగు పెట్టగానే ఒక్కసారిగా బీభత్సం చోటు చేసుకొంది. మసీదు లోపల ఉన్న వందలాది యువకులు పెద్ద ఎత్తున రాళ్ల దాడి మొదలు పెట్టారు. కోర్టు అధికారులు అడుగు తీసి ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది. సర్వే మాట దేవుడు ఎరుగు, ప్రాణాలు దక్కితే చాలు అనుకొని వెనక్కి పరుగులు తీశారు. ఈ మాదిరిగా తరిమి కొట్టడంతో దేశ వ్యాప్తంగా సంచలనం అయింది.
ఈ లోగా అక్కడ విద్యుత్ చౌర్యం విపరీతంగా జరుగుతోంది అని స్థానికుల్లో కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. నిజానికి సంబాలా పట్టణంలో దాదాపు 70 శాతం మంది ముస్లింలే. హిందువులు, ఇతర మతస్తులు తక్కువ సంఖ్యలో నివసిస్తూ ఉంటారు. స్థానికుల ఫిర్యాదు మేరకు రెవిన్యూ, పోలీసు, విద్యుత్ అధికారులు ఒక టీమ్ లా ఏర్పడి తెల్లవారు జామునే బాబ్రీ మసీదు చుట్టు పక్కల ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. ఆ తనిఖీల్లో కళ్లు తిరిగే వాస్తవాలు బయట పడ్డాయి. అనేక చోట్ల విద్యుత్ చౌర్యం నిర్భయంగా జరిగిపోతోందిఅని గుర్తించారు.
ఒక మసీదుకి పై అంతస్థులో ఏకంగా విద్యుత్ పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసేశారు. అక్రమంగా విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి , అక్కడ నుంచి వందకు పైగా ఇళ్లకు విద్యుత్ ను సరఫరా చేస్తున్నారు. నాలుగు మసీదులు, ఒక మదర్సా, పది ఫంక్షన్ హాల్స్ కు ఇక్కడ నుంచే కరెంటు సరఫరా జరుగుతోంది. ఇదే మాదిరిగా ఇంకా అక్రమ విద్యుత్ పంపిణీ సెంటర్స్ ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చలికాలంలో తెల్లవారు జామునే సోదాలు చేయటంతో ఒక్కసారిగా అక్రమాలు బయట పడ్డాయి. ఈ లోగానే స్థానికులు అక్కడకు చేరుకొని దాడులు చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలించలేదు.
ఈ సోదాల క్రమంలో మరో షాకింగ్ న్యూస్ బయట పడింది. అక్కడ భూమి కింద మరుగున పడిన శివాలయాన్ని వెలికి తీశారు. అక్కడ శివలింగం, ఎదురుగా నంది విగ్రహం స్పష్టంగా కనిపిస్తున్నాయి. శక్తివంతమైన హనుమాన్ విగ్రహం కూడా దర్శనం ఇచ్చింది. పోలీసుల సోదాల్లో ఈ విషయం బయట పడగానే సోదాలను వీడియోలతో రికార్డు చేయించారు. కిందకు తవ్వుకొంటూ వెళ్లినప్పుడు, పూర్తి స్థాయిలో విగ్రహాలన్నీ బయట పడ్డాయి. ఈ విషయాన్ని పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు.
దీనిని బట్టి బాబ్రీ మసీదు అసలు చరిత్ర ఏమిటి అన్నది తేలికగా అర్థం అయిపోతోంది. అందుచేతనే కోర్టు సర్వేయర్స్ ను అక్కడకు రానీయటం లేదు అని తేలిపోయింది. ఇప్పుడు ఈ విగ్రహాల విషయంలో కోర్టు ఏమి నిర్ణయం తీసుకొంటుందో వేచి చూడాల్సిన విషయం.