వచ్చే నెల 1 నుంచి 18 ఏళ్లు నిండిన అందరికీ కొవిడ్-19 వ్యాక్సీన్ ఇచ్చేందుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కృతజ్ఞతలు తెలిపారు.కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్కు ఆమె లేఖ రాశారు.25 సంవత్సరాలు పైబడిన అందరికీ వ్యాక్సినేషన్లో అవకాశం కల్పించాలంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రధానికి విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ… తమ ప్రభుత్వ డిమాండ్ కు రాజకీయంతో సంబంధం లేదన్నారు. థాకరే మాత్రమే కాక…మరికొందరు సీఎంలూ ఆ డిమాండ్ చేశారని గుర్తు చేశారు. రాజకీయంగా అనవసర వివాదాలు తలెత్తినా… 18ఏళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించడం గొప్ప విషయమన్నారు.