Tamil Nadu: Independent candidate Hari Nadar filed his nomination from the Alangulam constituency wearing around 4.27 kg gold yesterday
In his nomination papers, Nadar declared that he owns 11,200 grams of gold worth Rs 4.73 crores pic.twitter.com/hemW6bmhcW
— ANI (@ANI) March 17, 2021
ఎన్నికల నామినేషన్ పర్వంలో ప్రతిసారి వినూత్నంగా ప్రజలను ఆకర్షించేందుకు అభ్యర్ధులు ప్రయత్నిస్తుంటారు. ప్రజల దృష్టిని తమ వైపు మరల్చేందుకు.. అదే సమయంలో మీడియా దృష్టి కూడా తమవైపు తిప్పుకునేందుకు వినూత్న రీతిలో నామినేషన్ వేసేందుకు వస్తుండటం పరిపాటే. అయితే ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే తమిళనాడులో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియలో ఓ స్వతంత్ర అభ్యర్ధి యావత్ దేశ ప్రజల్ని తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. స్వతంత్ర అభ్యర్ధిగా బరిలో దిగేందుకు హరి నాదర్ అనే వ్యక్తి ఏకంగా 4.27 కిలోల బంగారు ఆభరణాలను ధరించి నామినేషన్ను దాఖలు చేశారు. అలంగుళం నియోజకవర్గం నుంచి ఆయన పోటీకి దిగనున్నారు. మెడలో బరువైన గొలుసులు, చేతికి కడియాలు, మోచేతి వరకు బంగారు తాపడాలతో నామినేషన్ కేంద్రానికి చేరుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాదు.. ఆయన వద్ద రూ.4.73 కోట్ల విలువైన బంగారం ఉందంటూ నామినేషన్ పత్రాలలో పేర్కొన్నట్లు సమాచారం.