నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఈసారి హిందూ దేవతలను ఉద్దేశించి అనుచిత పదాలు వాడారు.
మహారాష్ట్రలోని సతారాలో ఇండియన్ ట్రైబల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ మే 9న నిర్వహించిన కార్యక్రమంలో శరద్ పవార్ అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.
వెనుకబడిన కులానికి చెందిన తన దుస్థితిని వివరిస్తున్నట్టుండే .. జవహర్ రాథోడ్ కవిత్వాన్ని గుర్తుచేశారు. ‘మేము విగ్రహాలను చెక్కాం, మీరు వాటిని దేవాలయాలలో ఉంచారు. కానీ మీరు మమ్మల్ని దేవాలయాలలోకి ప్రవేశించనివ్వరు?” అని శరద్ పవార్ అన్నారు. అట్టడుగు వర్గాల వారిని దేవాలయాల్లోకి అనుమతించడం లేదని అర్చకులను విమర్శించేందుకు కవి జవహర్ రాథోడ్ కవిత్వాన్ని పవార్ ఉదహరించారు.
నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి, బ్రహ్మ – విష్ణు – మహేశ్వరులను మేం ఛన్నీ వంటి సాధనాలను ఉపయోగించి తయారు చేస్తాం.. దేవుడిగా మేమే చేసాం కాబట్టి మేము మీ దేవుని తండ్రులం. మాకు జరిగిన అన్యాయాన్ని సహించబోమని జవహర్ రాథోడ్ కవిత రాశారు” అనిఅన్నారు పవార్.
అంటరానితనాన్ని ఉద్దేశించి పవార్ హిందూ మతంలోని అగ్రవర్ణాలను పరోక్షంగా దూషించారు. శరద్ పవార్ ముఖ్యంగా మహారాష్ట్రలో బ్రాహ్మణులను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతుంటారు. కొన్నిసార్లు ఆయన నేరుగా కమ్యూనిటీ పేరు పెట్టి తిడతారు. మరికొన్నిసార్లు ఆయన తన విచిత్రమైన పదాల ద్వారా దూషిస్తుంటారు.
“నేను చెప్పేది ఒక్కటే, ఈ అణచివేత.. ప్రజలను పక్కన పెట్టే ధోరణి మన సమాజంలో ఇప్పటికీ ఉంది. నేటికీ అలా చేసే కమ్యూనిటీ ఉంది. ఆచారాలు, సంప్రదాయాలు మొదలైన వాటి ముసుగులో కులాలు, మతాల వంటి విషపూరిత ఆలోచనలను ప్రజల మదిలోకి ఎక్కిస్తున్నారు” అని అన్నారు.
శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ బీజేపీ నాయకుడు సునీల్ దేవధర్ ట్వీట్ చేశారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ హిందూ దేవుళ్లను నమ్మేవారిని ‘సాలా’ అని దూషించడం ద్వారా తన మానసిక సమతుల్యతను కోల్పోయారు. ఈ విఫలమైన రాజకీయ నాయకుడు నేను మీ దేవుళ్ల ‘బాప్’ అని చెప్పడం ద్వారా తన నైజం బయటపెట్టుకున్నాడు. ప్రజల ఆగ్రహావేశాలు చవిచూడకముందే రాజకీయాల నుంచి తప్పుకోవాలి” అని ట్వీట్ చేశారు.
NCP chief @PawarSpeaks has lost his mental balance & stooped low by abusing believers of Hindu Gods as ‘SAALA’.
This failed politician shown his frustration by saying that I’m ‘BAAP’ of your Gods.
He must quit politics before people make him irrelevant.#PawarAbusedHinduGods pic.twitter.com/AiiuBToY3I
— Sunil Deodhar (@Sunil_Deodhar) May 11, 2022