బాలీవుడ్ హీరోయిన్లు సారాఅలీఖాన్, జాన్హవి కపూర్ ఈమధ్య పుణ్యక్షేత్రాలు బాగా తిరుగుతున్నారు. ఇటీవలే కేదార్ నాథ్ ను సందర్శించారు. ఈ ఇద్దరి ఫొటోలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ముస్లిం అయిన సారా కేదార్ నాథుడిని దర్శించుకోవడం కొందరికి నచ్చలేదు. ముఖ్యంగా ముస్లింలకు. దీంతో ఆమెపై దూషణలకు దిగారు. ముస్లిం అయి ఉండీ హిందూ దేవాలయాలకు ఎలా వెళ్తావంటూ దాడి మొదలుపెట్టారు. ఆలయాన్ని సందర్శించిన చిత్రాలు పోస్ట్ చేసిన వెంటనే ఆమెను టార్గెట్ చేస్తూ తిట్టడం మొదలుపెట్టారు.
“Back to where it all began. #JaiBholenath #grateful #blessed,” అని సారా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఫొటోల్ని జతచేశారు.
సారా ఫస్ట్ మూవీ కేదారినాథ్. ఆ మూవీ షూటింగ్ కేదార్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిత్రీకరించారు. 2016లో ఉత్తరాఖండ్ వరదల నేపథ్యంగా దాన్ని రూపొందించారు. మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పూత్.
హిందూఆలయాన్ని సందర్శించడం ద్వారా ముస్లిం మతానికి కళంకం తీసుకువచ్చావని…విగ్రహారాధన క్షమించరాని పాపమని…అందుకు శిక్ష ఉంటుందంటూ నానా దుర్భాషాలాడారు. అసలు నువ్వు నిజంగా ముస్లింవేనా అంటూ ప్రశ్నించారు.