షహీద్ దివస్ సందర్భంగా మంగళవారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ భగత్ సింగ్,రాజ్‌గురు,సుఖ్‌దేవ్‌లకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మోదీ.. వారి త్యాగాలు తరతరాలకు స్పూర్తిదాయకమని కొనియాడారు. కాగా, ప్రతి ఏటా మార్చి 23వ తేదీని షహీద్ దివస్‌గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. బ్రిటీష్ పోలీస్ అధికారి జేపీ శాండర్స్‌ను భగత్‌సింగ్,రాజ్‌గురు,సుఖ్‌దేవ్‌లు హతమార్చారు. లాలాలజపతిరాయ్ మరణానికి ప్రతీకారంగా వీరు సదరు బ్రిటీష్ పోలీస్ అధికారిని చంపేశారు. అయితే అనంతరం వారే స్వచ్చందంగా లొంగిపోవడంతో.. వారికి అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం ఉరిశిక్ష విధించింది. అనంతరం వారిని మార్చి 23వ తేదీన ఉరితీశారు. అప్పటి నుంచి మార్చి 23వ తేదీని అమర వీరుల దినోత్సవంగాను, షహీద్ దివస్గాను జరుపుకుంటున్నారు.
https://twitter.com/narendramodi/status/1374194689792823296