కూకట్ పల్లిలోని PNM హై స్కూల్ లో సేవగాథ వెబ్ సైట్ తెలుగు వెర్షన్ ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది . రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం నిర్వహిస్తున్న సేవగాథ వెబ్ సైట్ ను తెలుగు భాష లో నేడు TSAT CEO శ్రీ శైలేష్ రెడ్డి గారు ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనం చేసిన అనంతరం శ్రీ శైలేష్ రెడ్డి గారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం చాలా మంచి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. అటువంటి కార్యక్రమాలలో ముఖ్యమైన కొన్నింటిని సేవా గాథ వెబ్ సైట్ లో ఉంచడం హర్షణీయమన్నారు. ఇప్పటికి ఆరు భారతీయ భాషల్లో మాత్రమే ఉన్న ఈ వెబ్ సైట్ ను ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, స్పానిష్ లాంటి భాషలలో కూడా ప్రారంభిస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం చేస్తున్న సేవ ప్రపంచానికంతటికి తెలుస్తుంది అన్నారు. ఈ కార్త్యక్రమం లో గౌరవ అతిధిగా పాల్గొన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా ప్రముఖ్ శ్రీ పరాగ్ అబ్యాంకర్ జీ మాట్లాడుతూ సేవ చేయటం కొత్తదేమీ కాదని సేవ భారతదేశ రక్తం లోనే ఇమిడి ఉందని తెలిపారు.
దక్షణ మధ్య క్షేత్ర సేవా ప్రముఖ్ ఎక్కా చంద్రశేఖర్ జి మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాలలో ఎన్నో ఏళ్లుగా వివిధ రంగాల్లో సేవా విభాగం పనిచేస్తుందని, భాగ్యనగరంలోని వైదేహి ఆశ్రమంలోని అన్నాద బాలికలకు అందిస్తున్న సేవ ఒక గొప్ప ఉదాహరణ అని తెలిపారు. కార్యక్రమంలో RSS తెలంగాణ ప్రాంత సంఘ్ చాలక్ దక్షిణా మూర్తి గారు, సికింద్రాబాద్ విభాగ్ సంఘ్ చాలక్ దుర్గా రెడ్డి గారు, ఉదయ్ సింగ్ గారు తదితరలు పాల్గొన్నారు.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)