కేరళ రాష్ట్రాన్ని కమ్యూనిస్టు పార్టీ కోటగా చెబుతుంటారు. అందులోనూ ఉత్తర ప్రాంతం అయినా వాయనాడ్.. కాంగ్రెస్ కమ్యూనిస్టులకు పూర్తి అడ్డా. రెండుసార్లుగా అక్కడ రాహుల్ గాంధీ గెలుపొందడం జరిగింది. తాజాగా అక్కడ కొండ చరియలు విరుచుకు పడడం, వరదలు పోటెత్తటం జరిగాయి.
ఇటువంటి ఆపద సమయంలో కూడా కమ్యూనిస్టు నాయకులు సోషల్ మీడియాకు పరిమితం అవుతూ ప్రకటనలు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.
కానీ సంఘ్ ఇచ్చిన స్ఫూర్తితో పని చేసే సేవా భారతి వాలంటీర్లు పగలు రాత్రి తేడా లేకుండా స్వచ్ఛంద సేవ చేస్తున్నారు.
కేరళ లోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 150 కి పైగా మృతదేహాలను కనుగొన్నారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారి సంఖ్య తెలియరాలేదు. వీరిని కనుగొనేందుకు జాగిలాల సాయం కూడా తీసుకుంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో.. సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇటు సహాయక చర్యల్లో రాష్ట్ర, కేంద్ర బలగాలకు తోడు.. సేవా భారతి వాలంటీర్లు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. బాధితులకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. ముఖ్యంగా బాధితులకు ఆహారం, నీరు అందించడంతో పాటు.. గాయపడ్డవారికి సకాలంలో వైద్యం అందేలా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారికి అంత్యక్రియలు సైతం నిర్వహిస్తున్నారు.
ఈ సేవా కార్యక్రమం నిరంతరంగా సాగుతోంది.
వయనాడ్ లోని చురల్ మలలో ఈ దుర్ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సేవాభారతి వాలంటీర్లు.. రెస్క్యూ ఆపరేషన్ లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుని.. సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. పగలు, రాత్రి తేడా లేకుండా బాధితులకు సహాయం చేయడం కోసం శ్రమిస్తున్నారు.
వర్షం పడుతున్నా.. బాధితులకు కావాల్సిన సాయాన్ని అందించడంలో ముందుంటున్నారు.
అలాగే బాధితులు వేగంగా ఆస్పత్రుల్లో చేరేలాగా కూడా ఈ సేవాభారతి వారు చూస్తున్నారు. చేరడమే కాకుండా వారికి వైద్యం అందేలాగా కూడా సమన్వయం చేస్తున్నారు. మరోవైపు రోడ్లపైన పేరుకుపోయిన చెత్తా చెదారం, పెద్ద పెద్ద రాళ్లను కూడా తొలగిస్తున్నారు. ఇక… అంబులెన్సులు వేగంగా ఆస్పత్రులకు వెళ్లేలాగా కూడా స్వయంసేవకులు, సేవా భారతి కార్యకర్తలు శతధా ప్రయత్నాలు చేస్తున్నారు. క్షతగాత్రులకు ఆహారం, మాత్రలు అందేలా చూస్తున్నారు. వీటన్నింటితో పాటు మృతదేహాల కోసం సేవా భారతి మొబైల్ వాహనాలను కూడా అందుబాటులో వుంచారు. కేరళలోని వాయనాడ్‌లో వున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల దహన సంస్కారాలకు కూడా ఇబ్బందులున్నట్లు తెలిసి… దహన సంస్కారాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానికంగా వున్న కష్ట నష్టాలను కూడా సేవా భారతి కార్యకర్తలు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా వుండే చిన్న చిన్న స్థలాలు, చిన్న చిన్న స్థలాల కారణంగా నడవడానికి కూడా ఇబ్బందిగానే వుంది. దహన సంస్కారాలు నిర్వహించేందుకు కూడా కష్టంగా వుంది. దీంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి, దహన సంస్కారాల్లో కూడా భాగం పంచుకుంటున్నారు. ఇక విశేషమేమిటంటే కులం, మతం అంటూ ఏదీ చూడకుండా స్వయంసేవకులు, సేవాభారతి వారు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సేవా భారతికి సంబంధించిన మొబైల్ దహన వ్యవస్థను క్రిస్టియన్లు కూడా స్వీకరించాయి.
సంఘ్ స్వయం సేవక్ లు, సేవా భారతి కార్యకర్తలు చేస్తున్న సేవలను కేరళ సమాజం ప్రశంసిస్తోంది. ఆపద సమయంలో ఆదుకుంటున్న కార్యకర్తలకు స్థానికులు అభిమానం తెలుపుతున్నారు.
కేరళ లోని వయనాడ్ లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో.. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 150 కి పైగా మృతదేహాలను కనుగొన్నారు. ఇంకా శిథిలాల కింద చిక్కుకున్నవారి సంఖ్య తెలియరాలేదు. వీరిని కనుగొనేందుకు జాగిలాల సాయం కూడా తీసుకుంటున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున వర్షం కురుస్తుండటంతో.. సహాయకచర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ఇటు సహాయక చర్యల్లో రాష్ట్ర, కేంద్ర బలగాలకు తోడు.. సేవా భారతి వాలంటీర్లు సైతం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. బాధితులకు కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. ముఖ్యంగా బాధితులకు ఆహారం, నీరు అందించడంతో పాటు.. గాయపడ్డవారికి సకాలంలో వైద్యం అందేలా ఆస్పత్రులకు తరలిస్తున్నారు. అంతటితో ఆగకుండా.. ఈ ప్రకృతి విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారికి అంత్యక్రియలు సైతం నిర్వహిస్తున్నారు.
వయనాడ్ లోని చురల్ మలలో ఈ దుర్ఘటన జరిగిన వెంటనే రంగంలోకి దిగిన సేవాభారతి వాలంటీర్లు.. రెస్క్యూ ఆపరేషన్ లో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో సమన్వయం చేసుకుని.. సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. పగలు, రాత్రి తేడా లేకుండా బాధితులకు సహాయం చేయడం కోసం శ్రమిస్తున్నారు. వర్షం పడుతున్నా.. బాధితులకు కావాల్సిన సాయాన్ని అందించడంలో ముందుంటున్నారు.
అలాగే బాధితులు వేగంగా ఆస్పత్రుల్లో చేరేలాగా కూడా ఈ సేవాభారతి వారు చూస్తున్నారు. చేరడమే కాకుండా వారికి వైద్యం అందేలాగా కూడా సమన్వయం చేస్తున్నారు. మరోవైపు రోడ్లపైన పేరుకుపోయిన చెత్తా చెదారం, పెద్ద పెద్ద రాళ్లను కూడా తొలగిస్తున్నారు. ఇక… అంబులెన్సులు వేగంగా ఆస్పత్రులకు వెళ్లేలాగా కూడా స్వయంసేవకులు, సేవా భారతి కార్యకర్తలు శతధా ప్రయత్నాలు చేస్తున్నారు. క్షతగాత్రులకు ఆహారం, మాత్రలు అందేలా చూస్తున్నారు. వీటన్నింటితో పాటు మృతదేహాల కోసం సేవా భారతి మొబైల్ వాహనాలను కూడా అందుబాటులో వుంచారు. కేరళలోని వాయనాడ్‌లో వున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల దహన సంస్కారాలకు కూడా ఇబ్బందులున్నట్లు తెలిసి… దహన సంస్కారాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
స్థానికంగా వున్న కష్ట నష్టాలను కూడా సేవా భారతి కార్యకర్తలు అర్థం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. స్థానికంగా వుండే చిన్న చిన్న స్థలాలు, చిన్న చిన్న స్థలాల కారణంగా నడవడానికి కూడా ఇబ్బందిగానే వుంది. దహన సంస్కారాలు నిర్వహించేందుకు కూడా కష్టంగా వుంది. దీంతో దహన సంస్కారాలు నిర్వహించేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేసి, దహన సంస్కారాల్లో కూడా భాగం పంచుకుంటున్నారు. ఇక విశేషమేమిటంటే కులం, మతం అంటూ ఏదీ చూడకుండా స్వయంసేవకులు, సేవాభారతి వారు సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సేవా భారతికి సంబంధించిన మొబైల్ దహన వ్యవస్థను క్రిస్టియన్లు కూడా స్వీకరించాయి