ఒడిశాలో దానా తుపాను విరుచుకు పడినప్పుడు .. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయం సేవకులు స్వచ్ఛందంగా ముందుకు కదలారు. సేవా భారతి కార్యకర్తలు అనేక గ్రామాలలోకి వెళ్లిపోయి విస్తారంగా సేవలు అందిస్తున్నారు. మహా కలపాడా, పారాదీప్, రాజ్ నగర్, రాజ్ కనిక, చందు బాలి వంటి చోట్ల వరద తీవ్రంగా ప్రభావం చూపుతోంది. పడిపోయిన చెట్లను తొలగించడం, విద్యుత్ స్తంభాలను పక్కకు చేర్చడం, రహదారిని క్లియర్ చేయడం, వాహనాలు వెళ్ళేటట్లు చేయడం వంటి భారీ పనులను స్వయం సేవకులు సమన్వయంతో చేస్తున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి అక్కడికి ఆహారము తాగునీరు మందులు ప్యాకెట్ల రూపంలో చేర్చుతున్నారు.
దేశంలో ఎటువంటి ఆపద వచ్చినా.. ప్రకృతి విపత్తు కావచ్చు,, మరో సంక్షోభం కావచ్చు,, ఆర్ ఎస్ ఎస్ స్వయం సేవక్ లు స్వచ్ఛందంగా ముందుకు కదిలి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. సేవా భారతి ఆధ్వర్యంలో వివిధ క్షేత్రాల కార్యకర్తలు కలిసికట్టుగా సహాయం చేస్తూ ఉంటారు. మొన్నటికి మొన్న కేరళను వరదలు ముంచెత్తినప్పుడు, ఆంధ్రప్రదేశ్ లో ఆకస్మిక వరదలు వచ్చి పడినప్పుడు … ఇదే మాదిరిగా సేవలు అందించడం జరిగింది. ఇప్పుడు ఒడిశాలో కూడా సంఘ్ కార్యకర్తలు చురుకుగా పనిచేస్తున్నారు.
కేంద్రపర, భద్రక్ వంటి జిల్లాలలో మారుమూల గ్రామాలు వరదల్లో చిక్కుకునిపోయాయి. అక్కడకు స్వయం సేవకులు కష్టం మీద వెళ్లి అక్కడే ఉండి బాధితులకు సహాయ చర్యలు చేపడుతున్నారు. వరద నీరు బురదను తొలగించి బ్లీచింగ్ చల్లి సురక్షిత చర్యలు చేపడుతున్నారు. శిబిరాలలోని బాధితులకు తాగునీరు మందులు పంపిణీ చేస్తున్నారు. ఇళ్ళ దగ్గర చిక్కుకున్న బాధితులకు ఆహార ధాన్యాలను రేషన్ కిట్లు రూపంలో అందిస్తున్నారు.