వరదలు విపత్తులు వచ్చినప్పుడు కొంతమంది ముందుకు వచ్చి సహాయం చేస్తారు. ఆ తర్వాత వెనక్కి వచ్చేస్తారు. భారీ విపత్తు వచ్చినప్పుడు ఆయా వ్యక్తుల మీద కుటుంబాల మీద సమస్య తీవ్రత కూడా అంతే భారీగా ఉంటుంది. ఉదాహరణకి వరదలు తలెత్తినప్పుడు ఇల్లు పొలాలు దెబ్బతిని కుటుంబాలతో సహా రోడ్డుని పడిపోతారు. అటువంటివారిని ఆదుకుని కుటుంబాలన్ని నిలబెట్టడంలో సేవా భారతి ఎప్పుడు ముందు నిలుస్తుంది.
తమిళనాడు కేరళలో పెద్ద ఎత్తున వరదలు విరుచుకుపడినప్పుడు కబుర్లు చెప్పే కుహనా మేధావులు ఎక్కడా కనిపించలేదు. కానీ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మరియు సేవా భారతి కార్యకర్తలు నిరంతరాయంగా సహాయ చర్యలు అందించారు. వరద సమయంలో ఆహార పొట్లాలు, తాగునీరు… తర్వాత కాలంలో రేషన్ కిట్లు, దుస్తులు వంటివి అందించారు. పగలు రాత్రి తేడా లేకుండా బాధితులకు నిరంతరాయంగా సేవలు అందించారు.
సేవా భారతి సహాయం అంతటితో అయిపోలేదు. వరదల్లో సర్వం కోల్పోయిన నిరుపేదలకు ఇల్లు కట్టించే పని చేపట్టింది. ఈ రోజుల్లో ఇళ్ళు నిర్మించాలంటే మామూలు విషయం కాదు,, అయినప్పటికీ నిరుపేదల కోసం సేవా భారతి ఈ సాహసానికి పూనుకుంది.
ఎంపిక చేసిన గ్రామాలలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు మరియు సేవా భారతి కార్యకర్తలు రంగంలోకి దిగారు. ఇంటి నిర్మాణానికి అవసరమైన సామాగ్రి ,, నగదు సమకూర్చి నిరుపేదలకు ఇళ్ళను కట్టించగలిగారు.
ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, తిరుచెందూర్ జిలా సంఘచాలక్ మాసనముత్తు , జోహో ఫౌండేషన్ సీఈఓ పద్మశ్రీ శ్రీధర్ వెంబూ, అఖిల భారతీయ సహ సేవా ప్రముఖ్ ఎ. సెంథిల్ కుమార్, దక్షిణ క్షేత్ర సంఘచాలక్ ఆర్.వన్నియారాజన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇతర నిరుపేదల ఇళ్లలోకి అవసరమైన కనీస సామగ్రిని కూడా స్వయం సేవకులు సమకూరుస్తున్నారు. వరదల్లో నష్టపోయిన బాధితులకి అండగా నిలుస్తున్నారు.
మన తెలంగాణలో కూడా భైంసా వంటి ప్రాంతాల్లో నిరుపేదలకు సేవా భారతి ఇళ్ళను నిర్మించి అందించింది. నిశ్శబ్దంగా సేవలో అందించే సేవా భారతి వంటి సంస్థల సేవలు చాలా గొప్పవి.