ఐసిఎంఆర్తో సంప్రదించి రాష్ట్ర-నిర్దిష్ట సెరో సర్వేలను నిర్వహించాలని కేంద్రం రాష్ట్రాలకు సలహా ఇచ్చింది.
దాని ఆధారంగా రాష్ట్రాలు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆద్వర్యంలో 4వ రౌండ్ సెరో రాష్ట్రాలు నిర్వహించాయి.
ఈ నాలుగో విడత సర్వే ఫలితాలు ఈ రోజు విడుదల అయ్యాయి.
దీని ఉద్దేశ్యం దేశం లో కోవిడ్ ని ఎదుర్కోగల సామర్ధ్యమున్న అంటి బాడీస్ ప్రజలలో ఏ మేరకు ఉన్నాయి అని అంచనా వేయడానికి. ఈ సర్వే లో బ్లడ్ సాంపిల్స్ తీసుకుంటారు. అలాగే వారికి గతంలో కోవిడ్ వచ్చిందా? వాక్సిన్ ఒక డోస్ తీసుకున్నారా? ,రెండు డోస్ లు తీసుకున్నారా? వయసు ఎంత? సిగరెట్, మందు అలవాటు ఉందా ఇలా చాలా వివరాలు సేకరిస్తారు. వాటి ఆధారంగా తయారు చేసిన డేటా ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో 79% సెరో ఉండి దేశంలో ప్రధమ స్థానంలో ఉండగా 44.4% శాతం తో కేరళ రాష్ట్రం చివరి స్తానం సంపాదించింది.
మూడో వేవ్ అక్టోబర్ లేదా నవంబర్ మాసాలలో వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. దానిని ఎదుర్కోడానికి తీసుకునే చర్యలకు ఈ డేటా ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది.