ఢిల్లీ ఎయిమ్స్‌కు ఎల్కే అద్వానీ.
Senior BJP leader LK Advani took his first dose of the #COVID19 vaccine at AIIMS Delhi today. pic.twitter.com/yj90aepVUf
— ANI (@ANI) March 9, 2021
దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సికేషన్ డ్రైవ్ వేగవంతగా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత.. మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్లకు పైబడిన వారితో పాటుగా.. 45 ఏళ్ల వయస్సు కలిగి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తొలి రోజు ప్రధాని మోదీ కూడా వ్యాక్సిన్ తొలిడోసు వేయించుకున్నారు. అనంతరం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు, పార్లమెంట్ సభ్యులు కూడా తొలి వ్యాక్సిన్ డోసును వేయించుకున్నారు. తాజాగా బీజేపీ అగ్రనేత, లాల్ కృష్ణ అద్వానీ కూడా మంగళవారం నాడు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు.