సీనియర్ నటి జయంతి కన్నుమూత-ప్రముఖుల నివాళి..
అన్ని దక్షిణాది భాషా చిత్రాల్లోనూ నటించి మెప్పించిన సీనియర్ నటి జయంతి కన్నుమూశారు. 76 ఏళ్ల జయంతి కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో రాత్రి ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె ఆస్పత్రిలోనే కన్నుమూశారు. 1945 జనవరి 6న బళ్ళారి లో జన్మించిన జయంతి… తెలుగు, తమిళ, హిందీ, మరాఠీ, కన్నడ, మలయాళ సినిమాల్లో రకరకాల పాత్రలు పోషించారు. 500పైగా సినిమాల్లో నటించగా… 300 సినిమాల్లో హీరోయిన్గా నటించారు. జయంతి మృతిపట్ల తెలుగు సినీప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమెకు నివాళి అర్పించారు.

actress Jayanti(File Photo)