ఈనెల 28న పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం సందర్భంగా స్పీకర్ ఆసనం పక్కనే చారిత్రక రాజదండం సెంగోల్ ను సైతం ప్రతిష్టించనున్నట్టు హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. షా ప్రకటనతో రాజదండం గురించే సర్వత్రా చర్చ నడుస్తోంది. బ్రిటిష్ పాలకులు స్వాతంత్ర్యం ప్రకటించి భారతీయులకు అధికారాన్ని అప్పగిస్తూ ఈ రాజదండాన్ని తొలి ప్రధాని నెహ్రూకు అప్పగించారు. సెంగోల్ తమిళ పదం సెమ్మై నుంచి వచ్చింది. అంటే ధర్మం అని అర్థం.
ఆగస్ట్ 14, 1947 రాత్రి 10.45 గంటల సమయంలో నెహ్రూ దాన్ని బ్రిటీష్ వారినుంచి రాజదండాన్ని స్వీకరించారు. దాన్ని స్వాతంత్ర్యానికి, అధికార మార్పిడికి చిహ్నంగా భావించారు.
తరువాతి కాలంలో రాజదండం గురించి అందరూ మర్చిపోయారు. అయితే రెండేళ్ల క్రితం ప్రముఖ నృత్యకారిణి పద్మాసుబ్రహ్మణ్యం పీఎంవోకు లేఖరాశారు. తాను రాసిన పరిశోధనా వ్యాసాన్ని అందుకు జతచేశారు.
1947లో భారతదేశ మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూకు సెంగోల్‌ను అప్పగించినప్పుడు జరిగిన వేడుక వివరాలను ప్రచురించిన తమిళ పత్రిక తుగ్లక్‌లో డా. సుబ్రహ్మణ్యం ఒక కథనాన్ని ఉటంకించారని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఆ సమాచారాన్ని బహిరంగపరచవలసిందిగా ప్రభుత్వాన్ని అభ్యర్థించడంతో ఆ నివేదికపై ప్రభుత్వం పరిశోధన మొదలుపెట్టింది.
ఆగస్టు 15, 1947 అర్ధరాత్రి నెహ్రూ జాతీయ జెండాను ఎగురవేసి, ప్రసంగించే ముందు సెంగోల్ వేడుక జరిగినట్లు తెలుస్తోంది. అప్పటినుంచి అది ప్రయాగరాజ్ మ్యూజియంలో ఉంది. ఇప్పుడు దాన్ని పార్లమెంట్లో ప్రతిష్టించబోతున్నారు.
https://twitter.com/AmitShah/status/1661315973373124608?s=20