తెలంగాణ వ్యాప్తంగా దేవాలయాలలో విగ్రహాల మీద జరుగుతున్న దాడులను హిందూ సమాజం నిరసిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే దేవీ దేవతల విగ్రహాలను పగలగొడుతున్న దుశ్చర్యలను అందరూ ఖండిస్తున్నారు. బరితెగించి విగ్రహాలను పగలగొడుతుంటే ప్రభుత్వ వ్యవస్థలు చోద్యం చూస్తున్నాయని మండిపడుతున్నారు.
ఇందుకు నిరసనగా విశ్వహిందూ పరిషత్, హిందూ వాహిని, భజరంగ్ దళ్ వంటి సంస్థల ఆధ్వర్యంలో శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇటీవల సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంలోని అమ్మవారి విగ్రహాన్ని ఇటీవల కొందరు దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. అలాగే మరికొన్ని దేవాలయాలలో కూడా విగ్రహాల ధ్వంసం సంఘటనలు జరుగుతున్నాయి.
ఈ సంఘటనలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చోటుచేసుకున్నాయి. ముత్యాలమ్మ ఆలయం వద్దకు చేరుకుని భారీగా నినాదాలు చేస్తు నిరసనలు చేపట్టారు హిందువులు. ఘటనకు కారణమైన నిందితుడిని కఠినంగా శక్షించాలంటూ డిమాండ్ చేశారు.
మరోవైపు రాష్ట్రంలో రోజురోజుకు హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు. దేవాలయాలపై దాడులను అదుపు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది.
విగ్రహాల మీద దాడులు చేసిన వారిని రక్షించేందుకు వీలుగా దుండగులు పిచ్చి వాళ్లని మద్యం మత్తులో ఉన్న వారిని చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రకమైన ముద్ర వేసి కేసుల నుంచి తప్పించేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాల మీద కూడా హిందూ వాహిని నాయకులు మండిపడుతున్నారు.