నూపుర్ శర్మ వ్యాఖ్యలతో మొదలైన దుమారం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. అయితే నూపుర్ శర్మ వ్యవహారం ఇంత సీరియస్ అవడంపై దేశప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పలువురు నాయకులు, జర్నలిస్టులు, మేధావివర్గం హిందుత్వను, హిందూ దేవీదేవుళ్లను ఎంతో అపహాస్యం చేశారని అప్పుడెలాంటి ఇష్యూ జరగలేదని ప్రస్తావిస్తున్నారు. హిందూ సంప్రదాయాలను లక్ష్యంగా సెలెబ్రిటీలు ఎలాంటి వ్యాఖ్యాలు చేశారో ఎవరో మర్చిపోలేదని అంటున్నారు. మెజారిటీలను ఈ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తూ.. దేవుళ్లు మరియు సంప్రదాయాలపై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. అయితే వారి వ్యాఖ్యలపై ఎప్పుడూ ఎక్కడా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. వారిని చంపాలని… చంపుతామని ఎవరూ బెదిరించలేదు, హెచ్చరించలేదు. కానీ ఓ మత గ్రంథంలో ఉన్న అంశాల్ని ప్రస్తావించినంతనే నూపుర్ ను ఉదారవాదులు టార్గెట్ చేయడం హిందుత్వవాదులను ఆలోచింపచేస్తోంది.
కొన్నేళ్లుగా సెక్యులర్లు, ఉదారవాదులు ఈ దేశంలో రెచ్చిపోతున్నారనే చెప్పవచ్చు. ముఖ్యంగా పలువురు నాయకులు, జర్నలిస్టులు. హిందూ దేవీదేవుళ్లు, హిందువుల మత విశ్వాసాలపట్ల ఎన్నిసార్లు నోరుజారారో. అసలు అలాంటి స్టేట్మెంట్లు చేసి సెలబ్రిటీలు అయిన వాళ్లున్నారు.
ఏకంగా ఈ దేశంలోని ఓ రాష్ట్రాన్ని ఏలుతున్న అరవింద్ కేజ్రీవల్ ఇటీవల కశ్మీరీ హిందువుల గురించి ఏం మాట్లాడారో చూశాం. కశ్మీర్ హిందువుల ఊచకోత, తరిమివేత నేపథ్యంగా తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ మూవీ దేశంలో సంచలనం రేపుతున్న తరుణంలో అదోక నకిలీ చిత్రం అన్నారు కేజ్రీ. అంతేకాదు హిందూ దేవుళ్లు, పవిత్ర చిహ్నాలు, సంప్రదాయాలనూ అపహాస్యం చేసిన సందర్భాలు అనేకం. రామజన్మభూమి వివాదం పరిష్కారం అవడం అక్కడ గుడి కట్టడం తన నాన్నమ్మకు ఇష్టం లేదని.. ఆ స్థానంలో పాఠశాలలు, కళాశాలలు, ఆస్పత్రులు నిర్మించాలని పదే పదే పిలుపునిచ్చారు.
2019లో తనపార్టీ చిహ్నం చీపురుతో.. హిందువుల పవిత్ర చిహ్నం స్వస్తిక్ గుర్తు వెనక పరుగెత్తుతున్నట్టు చిత్రాన్ని షేర్ చేశారు. మరో సందర్భంలో తనపై వస్తున్న ఆరోపణల నుంచి దృష్టి మరల్చేందుకు హనుమంతుడు జేఎన్‌యూను తగులబెడ్తున్నట్టున్న కార్టూన్ ను ట్వీట్ చేశారు. కేజ్రీవాల్ మాత్రమే కాదు ఆ పార్టీకి చెందిన సంజయ్ సింగ్ వంటి వాళ్లూ అయోధ్య రామజన్మభూమి ట్రస్ట్ నిధుల దుర్వినియోగానికి పాల్పడిందని అవాస్తవాలు ప్రచారం చేశారు.
ఆగష్టు 2020లో, AAP యొక్క అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి మరో అభ్యంతరకర ట్వీట్. ఉత్తరాఖండ్‌లోని నందా దేవి కొండలు, సిక్కింలోని కంచన్‌జంగా చిత్రాలను షేర్ చేస్తూ వివాదాస్పద ట్వీట్లు చేసింది. భారతదేశంలోని ఆ ఎత్తైన ఆ పర్వతాలను హిందువులు భయపడే పర్వతాలంటూ ఎగతాళి చేస్తూ ట్వీట్ చేసింది.
ఇక ఇటీవల జ్ఞానవాపిలోని వుజుఖానా దగ్గర శివలింగం బయటపడిన ఘటనలో శివలింగంపై ఎన్నో అపహాస్యపు కుళ్లు జోకులను మనం చూశాం. టిఎంసి ఎంపి మహువా మోయిత్రా భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ చిత్రాన్ని జత చేస్తూ తదుపరి తవ్వే జాబితాలో ఇది లేదని ఆశిస్తున్నట్టు పోస్టు చేసింది.
సబానఖ్వి సైతం ఇంచుమించు అలాగే ట్వీట్ చేసింది.
ఆర్జేడీ నేత కుమార్ దివాశంకర్ సైతం బీజేపీని, శివలింగాన్ని హేళన చేస్తూ హిందూ మనోభావాలను దెబ్బతీసేలా ట్వీట్ చేశారు.
వుజుఖానాలో శివలింగం బయటపడి జ్ఞానవాపి మసీదుకు సీలు వేయాలని వారణాశి కోర్టు ఆదేశించిన తర్వాత షాదాబ్ చౌహాన్ అవహేళన చేస్తూ ట్వీట్ చేశారు. ఎవరైనా శివలింగాన్ని క్లెయిమ్ చేస్తే న్యాయమూర్తి ఆ ప్రాంతాన్ని సీల్ చేయమంటారంటూ చిన్న స్తంభాలతో కప్పిన కర్బ్‌సైడ్ చిత్రాన్ని పోస్ట్ చేశారు.
ఇక ఎంఐఎం నాయకుడు డానిష్ ఖురేషి అయితే మరో అడుగు ముందుకేశాడు. జ్ఞానవాపిలో బయటపడిన శివలింగం చిత్రాన్ని జతచేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. దానిపై గుజరాత్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు కూడా. అతను తన ఉద్దేశ్యం ఎవరి భక్తిని దెబ్బతీయకూడదని మరియు అతను తన జ్ఞానాన్ని పెంచుకోవాలనుకుంటున్నాడని ఒక రైడర్‌ను జోడించగా, అతని తదుపరి పరీక్ష హిందూ మతంలోని శివలింగ భావనను అవమానించడమే అతని ఉద్దేశమని స్పష్టం చేసింది. ఈ వ్యాఖ్యపై గుజరాత్ పోలీసులు అతన్ని అరెస్టు చేసినప్పటికీ, అతను ఎప్పుడైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఎకనామిక్ టైమ్స్ భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌ను శివలింగంగా చిత్రీకరిస్తూ, BOM BHOLENATH అనే శీర్షికతో హిందువులను అపహాస్యం చేస్తూ కార్టూన్ ను ప్రచురించింది. ఆ సంస్థ కాలమ్ లోని మరో కార్టూన్ కూడాచాలా అభ్యంతరంగా ఉంది. తాజ్ మహల్ మూసి ఉన్న గేట్లను తెరవమని అరుస్తున్నట్టు అందులో ఉంది.
ఢిల్లీ యూనివర్శిటీలోని హిందూ కాలేజీలో హిస్టరీ అసోసియేట్ ప్రొఫెసర్ రతన్ లాల్ …
జ్ఞానవాపి వివాదాస్పద నిర్మాణంలో దొరికిన శివలింగం గురించి సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్ట్ చేశారు. అది శివలింగమైతే, “బహుశా శివుడు కూడా సుస్తీ చేయించుకున్నట్టు అనిపిస్తోంది. ” అని కామెంట్ చేశాడు. మరో ప్రొఫెసర్ రవికాంత్ చందన్ అయితే పండిట్లు ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న చట్ట విరుద్ధ కార్యకలాపాలు చూసే ఔరంగజేబు దాన్ని కూల్చివేశారని అన్నారు. ఆయన ప్రస్తావించిన పుస్తకంలో విషయం చరిత్రలో ఎక్కడా లేదు. దాన్ని సీరియస్‌గా తీసుకోవద్దని స్వయంగా పుస్తక రచయితే చెప్పాడు.
This hurts my religious sentiments. I will appreciate if Dr. Ratan Lal is booked under section 153A IPC & other provisions of IPC and case be pursued against him. @CPDelhi @DelhiPolicehttps://t.co/G8HJXVpEZ7 pic.twitter.com/9vf5Wy7KZE
— RP Singh National Spokesperson BJP (@rpsinghkhalsa) May 17, 2022
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ రకీబ్ హమీద్ నాయక్ వైట్ హౌస్ చిత్రాన్ని, దాని ముందు ఒక ఫౌంటెన్‌ను ఉంచాడు. తీవ్ర నిరసన రావడంతో దాన్ని తొలగించాడు.
అలీఘర్ ముస్లిం యూనివర్శిటీకి అనుబంధంగా ఉన్న JN మెడికల్ కాలేజీలో ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జితేంద్ర కుమార్ తన తరగతి గదిలో లైంగిక నేరాల గురించి బోధిస్తూ…హిందూ దేవుళ్లను కించపరిచే సూచనలు చేశాడు. నిరసనలు రావడంతో యూనివర్సిటీ ఆయన్ని సస్పెండ్ చేసింది అన్నారు కానీ ఎలాంటి విచారణ జరగలేదు. చర్యలపై ఎలాంటి అప్డేట్స్ లేవు.
2002లో గోద్రా రైలు దహనం ఘటనలో మరణించిన 59 మంది కరసేవకులను, సీతామాతను అపహాస్యం చేస్తూ కమెడియన్ మునావర్ ఫరూఖీ చేసిన వ్యాఖ్యల్ని ఎవరైనా మరిచిపోగలరా… హిందువులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో పలుచోట్ల అతని ప్రదర్శనలు రద్దయ్యాయి. అయినా చాలాచోట్ల అతని ప్రదర్శనలు కొనసాగుతున్నాయి.
వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు ఇలియాస్ షరాఫుద్దీన్ శివలింగాన్ని పురుషుడి ప్రైవేట్ పార్ట్ తో పోలుస్తూ… హిందువులు విగ్రహాలను, ప్రైవేట్ పార్ట్స్ ను పూజిస్తారని అపహాస్యం చేశాడు. . జీ న్యూస్ నిర్వహించిన ‘తాల్ థోక్ కే’ డిబేట్లో పాల్గొన్న వారిలో ఆయన ఒకరు. వేదాలు, గీత, ఉపనిషత్తులను ప్రస్తావిస్తూ… విగ్రహాన్ని ఆరాధించేవారు నరకానికి పోతారని వెటకారం చేశారు. ఇతర పార్టిసిపెంట్స్ ను నోరెత్తకుండా నవ్వుతూ వెకిలి కామెంట్లు చేశాడు.
ज्ञानवापी में ॐ नम: शिवाय? + वीडियो 'सबूत' दावा मजबूत? #TaalThokKe #GyanvapiVideoLeak पर ट्वीट कीजिए @aditi_tyagi
अन्य खबरों के लिए क्लिक करें – https://t.co/asaJAvmeIt
https://t.co/NxRLysX5fJ— Zee News (@ZeeNews) May 31, 2022
AIMIM నేత అక్బరుద్దీన్ ఒవైసీ ఓ ప్రసంగంలో హిందూ దేవుళ్లను ‘మన్హూస్’ అని అన్నారు.
He says about Hindu gods & goddesses “Main unke manhoos naam iss mubarak mehfil mein nahi lena chahta”. The crowd roars in approval.
In India, if you oppose such behaviour or respond to it, you are branded communal & cases are filed against you.#ArrestAkbaruddinOwaisi pic.twitter.com/4sYeZyLosx
— Major Gaurav Arya (Retd) (@majorgauravarya) June 8, 2022
ఇక బెంగాలీ సినీ నటి సయోని ఘోష్ తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో చాలా అభ్యంతరకరమైన కార్టూన్లను షేర్ చేశారు. నిరసనలు రావడంతో తన ఖాతా హ్యాక్ అయిందని అబద్దాలాడింది. ఆమెకు తరువాత టీఎంసీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది.
నాయకులు, జర్నలిస్టులు తరచూ హిందుమతాన్ని చులకన చేస్తుంటారు. వారికి వామపక్ష-ఉదారవాదులంతా వారికి మద్దతుగా వస్తారు. ఇటీవలి కాలంలో, హిందువులను లక్ష్యంగా అపహాస్యం చేయడం మరీ ఎక్కువైంది. హిందువుల నుంచి నిరసన వచ్చినప్పుడు మాత్రం పోస్టులు డిలిట్ చేస్తుంటారు.
2019లో, రెడ్ లేబుల్ గణేష్ చతుర్థిపై హిందువులను ద్వేషపూరిత మూర్ఖులుగా చిత్రిస్తూ ఓ యాడ్ రూపొందించింది. ఒక వ్యక్తి గణేష్ విగ్రహాన్ని కొనాలనుకుంటున్నాడు. ఓ విగ్రహాల తయారీదారు దగ్గరికెళ్లి తనకు కావల్సింది అడుగుతాడు. అతని తలపై పుర్రె తల ఉన్న టోపీ ఉంటుంది. దీంతో అతను ముస్లిం అని గ్రహించి అతని దగ్గర కొనకూడదని ముందుకు కదులుతాడు. అయితే విగ్రహతయారీదారు అతన్ని ఆపి సంస్కరించేపనిలో పడతాడు. అంతే అతను మారిపోయి విగ్రహం అతని దగ్గరే తీసుకుంటాడు. రెడ్ లేబుల్ హిందుస్థాన్ యూని లీవర్ బ్రాండ్. పదేపదే ఆ సంస్థ హిందువులను కించపరుస్తూ ఉంటుంది.
2020లో లవ్ జిహాద్‌ను కీర్తిస్తూ జ్యువెలరీ బ్రాండ్ తనిష్క్ ఒక ప్రకటన విడుదల చేసింది. హిందూ యువతి ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది అందులో.ఆమెకు ఆకుటుంబం సీమంతం చేస్తుంటుంది. దీంతో తనిష్క్ ను బ్యాన్ చేస్తామని వినియోగదారులు పిలుపునివ్వడంతో దాన్ని యూట్యూబ్ నుంచి తొలగించారు. 2021లో, ప్రముఖ ఎథ్నిక్ గార్మెంట్ బ్రాండ్ ఫాబిండియా దీపావళి ప్రచారాన్ని ప్రారంభిస్తూ… ‘జష్న్-ఎ-రివాజ్’ సేకరణను ప్రారంభించింది. హిందువుల పండుగ సెంటిమెంట్లను అపహాస్యం చేస్తూ ప్రకటన ఉండడంతో నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తరువాత ఫ్యాబ్ ఇండియా అది దీపావళి ప్రచారం కాదని… సరదాగా నవ్వించడానికి అంటూ సాకు చెప్పింది.