మన వామపక్ష భావజాల మేధావులు, పత్రికా విలేఖరులు, ఉదారవాదులు, తటస్తులు అని చెప్పుకునే బిజేపి ద్వేషులు కాంగ్రెస్ పార్టీని సెక్యులర్ పార్టీగా పరిగణిస్తూ బిజేపిని ద్వేషించడం కోసం ఆ పార్టీని భుజాన్న మోస్తారు. ఒక్క కాంగ్రెస్ నే కాదు కుల, మైనార్టీ, మత రాజకీయాలు నడిపే కుటుంబ పార్టీలను సెక్యులర్ పార్టీలగానే పరిగణిస్తారు.
ఉత్తరప్రదేశ్ ఎన్నికలు వస్తున్నాయి కదా! ఇక రోజూ బిజేపి నాయకులు ఎటువంటి స్పీచ్ లు ఇస్తున్నారు వాటిలో వెతికి పట్టుకుని మత పరమైన విషయాలు పైకి లాగి లేదా మామూలుగా మాట్లాడినా వాటికి విపరీత మతపరమైన అర్ధాలు తీసి, బిజేపి చూడండి ఓట్ల కోసం ఎలా మతాన్ని వాడుకుంటుందో అని పేపర్లలో వ్యాసాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వుంటారు.
బెంగాల్ ఎన్నికలప్పుడు కేంద్రం లో బిజేపిని దింపాలి అంటే నాకే మీరు వోట్ వెయ్యాలి. కాంగ్రెస్ కి, సిపిఎంకి వేస్తే ఆ ఓట్లు వేస్ట్ అయిపోతాయి అని ముస్లింలను వారి ఇలాకాలో సంబోధిస్తూ మమత ఓట్లు అడుక్కోవడం ఈ మేధావుల దృష్ఠిలో మతం వాడుకోవడం కాదు దానిని సెక్యులరిజం అంటారు.
అలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ ముస్లిం ఓటర్లలో మాట్లాడుతూ ఈ సారి యోగి ముఖ్యమంత్రి అయితే అతను రాబోయే రోజుల్లో ప్రధాని కూడా అవుతారు అని వారిని భయపెట్టడం కూడా మతతత్వం కాదు, దానికి వీళ్ళు సెక్యులరిజం అని ముద్దుగా పిలుచుకుంటారు.
ఇంకా ఈ తరానికి తెలియని సెక్యులర్ ఎన్నికల ప్రచారం 1984లో ఇందిర పోయిన తరువాత రాజీవ్ గాంధీ ప్రధానిగా ఎన్నిక కావడం కోసం జరిగిన లోక్ సభ ఎన్నికలు.
ఆ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సిక్కులను నేరుగా టార్గెట్ చేస్తూ పత్రికలలో ప్రకటనలు ఇచ్చింది. పోస్టర్స్ కూడా ప్రచురించింది.
పత్రికలలో అయితే సిక్కు వర్గాన్ని పరోక్షంగా పేర్కొంటూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చింది.
అప్పుడు ఇచ్చిన ప్రకటనలో సారాంశం చూడండి. నేడు ఇటువంటి ప్రకటన ఏ పొలిటికల్ పార్టీ ఇచ్చి ఉంటే?
“why should u smile uneasily at your next door neighbour just because he belongs to another community or speaks another language?
Why should you feel uncomfortable riding in a taxi driven by a taxi driver belongs to another state?
మీ పక్కింటి ఇరుగుపొరుగు వారు మరొక కమ్యూనిటీకి చెందినవారు లేదా మరొక భాష మాట్లాడతారు కాబట్టి అతనితో మీరు ఎందుకు ఇబ్బందికరంగా నవ్వాలి?
మరొక విశ్వాసానికి చెందిన టాక్సీ డ్రైవర్ నడుపుతున్న టాక్సీలో ప్రయాణించడం మీకు ఎందుకు అసౌకర్యంగా అనిపించాలి?
Courtesy :- Chada Shastry