అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కార్యాలయంలో రహస్య పత్రాలు బయటపడిన వ్యవహారం దుమారం రేపుతోంది. మధ్యంతర ఎన్నికలముందే విషయం బయటకు పొక్కినా…ఎన్నికల్లో లబ్ధి కోసం తొక్కిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఉక్రెయిన్, ఇరాన్, యూకేకు చెందిన సున్నితమైన కీలకమైన అంశాలకు చెందిన ఫైల్స్ ఉన్నట్టు సమాచారం. దేశంలోని ముఖ్యవ్యక్తులకు ఇంటెలిజెన్స్ సంస్థలు అందించే సంక్షిప్త సారాంశాలుగా తెలుస్తోంది. మరో మూడు నాలుగు బాక్సుల రహస్య పత్రాలు కూడా ది ప్రెసిడెన్షియల్ రికార్డ్స్ యాక్ట్ పరిధిలోకి వచ్చేవేకావడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. అసలైతే ఆ పత్రాలన్నీ 2022 నవంబర్ 2నే వెలుగుచూశాయి. రహస్య పత్రాలు అని రాసిఉన్న కవర్ ను గుర్తించారు. వాటిని బైడెన్ బృందం జాగ్రత్తగా తొలగించింది. మధ్యంతర ఎన్నికలు ఉండడంతో ఆ విషయాన్ని బయటికి రానీయలేదని సమాచారం .